ఇది ఇంకో స్వాహా..!

ABN , First Publish Date - 2022-11-09T00:23:12+05:30 IST

మీకు విలువైన భూమి ఉందా..? అయితే ఒక్కసారి మీ పేరిట ఉందో లేదో చూసుకోండి..! కళ్లెదుటే భూమి ఉంది కదా.. ఎవరొస్తారులే అని ఏమరుపాటుగా ఉండొద్దు..! మీకు తెలియకుండానే అది మరొకరి పేరిట మారిపోయి ఉండొచ్చు. మీ భూమిని దర్జాగా ఎవరైనా అమ్మేసుకుని ఉండొచ్చు..! ‘పక్కా ప్రైవేట్‌ ల్యాండ్‌. నా సంతకం లేనిది ఇంచు కూడా కదలదు..’ అని ధీమాగా ఉండొద్దు.

ఇది ఇంకో స్వాహా..!
రోటరీపురం వద్ద ఉన్న భూమి ఇదే..

రూ.4 కోట్ల భూమి అక్రమ రిజిసే్ట్రషన

ఆధార్‌లో ఫొటో మార్చి కాజేసిన కేటుగాళ్లు

అడంగల్‌ కోసం వెళ్లిన యజమానికి షాక్‌

కుట్రను ఛేదిస్తున్న బుక్కరాయసముద్రం పోలీసులు

కొందరిని తప్పించేందుకు కడప నేతల ఒత్తిళ్లు

మీకు విలువైన భూమి ఉందా..? అయితే ఒక్కసారి మీ పేరిట ఉందో లేదో చూసుకోండి..! కళ్లెదుటే భూమి ఉంది కదా.. ఎవరొస్తారులే అని ఏమరుపాటుగా ఉండొద్దు..! మీకు తెలియకుండానే అది మరొకరి పేరిట మారిపోయి ఉండొచ్చు. మీ భూమిని దర్జాగా ఎవరైనా అమ్మేసుకుని ఉండొచ్చు..! ‘పక్కా ప్రైవేట్‌ ల్యాండ్‌. నా సంతకం లేనిది ఇంచు కూడా కదలదు..’ అని ధీమాగా ఉండొద్దు. ఎందుకంటే.. మీ పేరుతోనే.. మీ ఆధార్‌ కార్డుతోనే అమ్మేసే టెక్నిక్స్‌ తెలిసిన కేటుగాళ్లు జిల్లాలో చాలామందే ఉన్నారు. ఇటీవలి వరుస ఘటనలు ఇందుకు నిదర్శనం. ఆధార్‌లో నకిలీ ఫొటోలు, నకిలీ ఎనఓసీలు, ఫేక్‌ డాక్యుమెంట్లు.. ఇలా ఎన్నెన్నో కుట్రలు వరుసుగా బయట పడుతున్నాయి. కళ్యాణదుర్గం రోడ్డులోని ఇంటి స్థలాన్ని కాజేశారు. రాచానపల్లి వద్ద సుమారు 15 ఎకరాలన కాజేశారు. కమ్మూరులో ప్రభుత్వ భూమిని మింగేశారు. తాజాగా రోటరీపురం వద్ద రూ.4 కోట్ల భూమిని స్వాహా చేశారు. అందుకే.. మీ భూమి మీ పేరిటో ఉందో లేదో ఒక్కసారి చెక్‌ చేసుకోండి..!

సింపుల్‌గా కాజేశారు..

అనంతపురం నగరానికి చెందిన రాందాసు అనే వ్యక్తికి బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీపురం వద్ద 2.06 ఎకరాల భూమి ఉంది. అనంతపురం-తాడిపత్రి రాష్ట్ర రహదారి పక్కనే, సర్వే నెంబర్‌ 20-2లో ఉన్న ఈ భూమి విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుంది. దీన్ని కాజేసేందుకు నార్పల మండలం గూగూడుకి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి కుట్ర చేశాడు. అక్రమంగా భూమిని అమ్మేసేందుకు.. భూ యాజమాని ఆధార్‌లో ఫొటోను మార్పించాడు. అనంతపురం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాచమ్యాన శివ అనే వ్యక్తి ఫొటోను రాందాసు ఆధార్‌లో చేర్పించాడు. శివ అనే వ్యక్తికి ఇప్పటికి అధార్‌, రేషన కార్డు సహా ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేక పోవడం అక్రమార్కలకు కలిసి వచ్చింది. శివకు రూ.2 వేలు, మద్యం ఎరగా వేశారు. అనంతపురంలో అధార్‌ మార్ఫింగ్‌ చేశారు. అనంతరం రిజిస్ర్టేషన కార్యాలయానికి అతన్ని తీసుకువెళ్లి.. పొలిమిగుండ్ల శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.58 లక్షలకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన చేయించారు. 2021 మార్చి 12న ఈ అక్రమ రిజిస్ట్రేషన జరిగింది. ఈ రిజిస్ట్రేషన డ్యాక్యూమెంట్‌తో తహసీల్దార్‌ కార్యాలయంలో వన బి అడంగల్‌లో పేరు మార్చుకున్నారు. అనంతరం పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఈ పనులన్నీ చకచకా జరిగిపోయాయి. రిజిసా్ట్రర్‌, రెవెన్యూ కార్యాలయాల్లో ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయించారు.

దర్యాప్తుపై ఒత్తిళ్లు..?

భూమిని కాజేసేందుకు కుట్ర చేసినవారిలో కొందరిని తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి, గూగూడుకు చెందిన శ్రీరాములుపై ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం. ముదిగుబ్బ మండలానికి చెందిన శివశంకర్‌ రెడ్డి, సూర్యనారాయణపై కేసు నమోదు చేశారు. వీరిలో శివశంకర్‌ రెడ్డిని కేసు నుంచి తప్పిస్తారని తెలిసింది. కుట్రలో శివశంకర్‌ రెడ్డి పాత్ర లేదని, తెలియక కొనుగోలు చేశాడని దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. ఆధార్‌లో ఉన్న వాచమన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి శ్రీరాములు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆధార్‌లో ఫొటో మార్చేందుకు సహకరించిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మా వాళ్లే.. కొంచెం చూడండి..

అక్రమ రిజిస్ట్రేషన వ్యవహారంలో కుట్రదారులను తప్పించేందుకు కడప జిల్లాకు చెందిన సీఎం సమీప బంధువు, ఓ ప్రజా ప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకుండా చూడాలని, తమ వారిపై ఎలాంటి ఒత్తిడి చేయొద్దని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు సూచించారని తెలిసింది. కుట్ర వెనుక కడప జిల్లా ప్రజా ప్రతినిధి, ఓ పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తే ఈ వ్యవహారం బయట పడుతుంది.

- బుక్కరాయసముద్రం

Updated Date - 2022-11-09T00:23:15+05:30 IST