అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి రజిని
ABN , First Publish Date - 2022-09-18T23:37:31+05:30 IST
అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి రజిని

అమరావతి: మూడు రాజధానుల అవసరాన్ని సీఎం ఇప్నటికే చెప్పడం జరిగిందని మంత్రి విడదల రజిని అన్నారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పాదయాత్ర జరుగుతుందన్నారు. శాంతిభద్రతలు సమస్య వస్తే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఐదు మెడికల్ కాలేజ్‌ల్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు. చంద్రబాబు మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక పద్దతి, ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజ్‌లు తీసుకొస్తామని ఆమె తెలిపారు. తల్లిలాంటి భారతిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము కూడా అదేస్థాయిలో సమాధానం చెప్తామన్నారు.