విధ్వంసకర అభివృద్ధితో వినాశనం
ABN , First Publish Date - 2022-12-05T01:11:04+05:30 IST
విధ్వంసకర అభి వృద్ధితో వినాశనం తప్పదని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధ పేర్కొన్నారు.
అమలాపురం టౌన్, డిసెంబరు 4: విధ్వంసకర అభి వృద్ధితో వినాశనం తప్పదని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధ పేర్కొన్నారు. రాజ్యాంగ విలు వలు -వ్యవస్థల పాత్రపై ఆమె ప్రసంగించారు. అమలా పురం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగ ణంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి సుధ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ విలువలను పరిర క్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరు వల్లే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర కార్యనిర్వహణవర్గ సభ్యుడు జి.రోహిత్, విధ్వంసకర అభివృద్ధి అనే అంశంపై ప్రసం గించారు. సమానత్వమే లక్ష్యంగా అభివృద్ధి ఉండాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిం చిన పలు పోటీల్లో విజేతలకు సుధ సర్టిఫికెట్లు, హక్కుల ఉద్యమ నేత కె.బాలగోపాల్ సాహిత్యాన్ని అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు వల్లీ, పవన్, సికిలే పృథ్వీ, ఎల్‌ఎస్ సత్యనారాయణ, దీపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.