ఉపాధి పథకం పనుల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2022-11-03T00:41:39+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం విరవాడ ఎస్సీ కాలనీలో బుధవారం దళిత ఆత్మీ య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పను లు చేసిన కూలీలకు 6నెలలు నుంచి సక్రమంగా వేతనాలు

ఉపాధి పథకం పనుల్లో అవకతవకలు
విరవాడలో మాట్లాడుతున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం రూరల్‌, నవంబరు 2: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం విరవాడ ఎస్సీ కాలనీలో బుధవారం దళిత ఆత్మీ య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పను లు చేసిన కూలీలకు 6నెలలు నుంచి సక్రమంగా వేతనాలు రావడంలేదని, మస్తర్లు సరిగా వేయ డం లేదని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు పనికి రాకుండా ఇళ్లవద్ద ఉన్నా మస్తర్లు వేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కాలనీలో టీడీపీ హయాంలో రూ.85లక్షలతో అభివృద్ధి పనులు నిర్వహించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పనికూడా జరగలేదన్నారు. ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన 28 పథకాలను రద్దు చేశారని, వైసీపీ పాలనలో దళితులు తీవ్రమైన ఇబ్బందు ల్లో ఉన్నారని వర్మ చెప్పారు. సమావేశంలో టీడీ పీ మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, నాయకులు దారా త్రిమూర్తులు, ఎలుబండి రాజారావు, కొమ్మిరెడ్డి రమణ, కందా శేషగిరి, దారా బుల్లబ్బాయి, దాకే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:41:40+05:30 IST