Union Govt: జగన్ సర్కార్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలం
ABN , First Publish Date - 2022-12-23T19:12:24+05:30 IST
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ (Jagan government) పూర్తిగా విఫలమైందని కేంద్రం (Union Govt) పరోక్షంగా వెల్లడించింది.
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ (Jagan government) పూర్తిగా విఫలమైందని కేంద్రం (Union Govt) పరోక్షంగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీకి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0.5 శాతం మాత్రమే అని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో జగన్ సర్కార్‌కు పదో స్థానం నిలిచిందని, 9 నెలల కాలంలో 217 మిలియన్ డాలర్ల పెట్టుబడులే వచ్చాయని రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. అన్ని రాష్ట్రాలకు మొత్తం 42,509 మిలియన్ డాలర్ల పెట్టుబడి రాగా.. అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి. 1,287 మిలియన్ డాలర్లతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచిందని కేంద్రం పేర్కొంది.