రైతు భరోసా కేంద్రాల తనిఖీ
ABN , First Publish Date - 2022-11-03T23:33:57+05:30 IST
పోరుమామిళ్ల మండలంలోని రైతు భ రోసా కేంద్రాలను పంట నమోదు కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వర్‌రావు పరిశీలించారు.
పోరుమామిళ్ల, నవంబరు 3 : పోరుమామిళ్ల మండలంలోని రైతు భ రోసా కేంద్రాలను పంట నమోదు కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వర్‌రావు పరిశీలించారు. గురువారం ఆ యన పోరుమామిళ్ల, కలస పాడు మండలాల్లోని సిద్దవరం, పోరుమామిళ్ల, అక్కల్‌రెడ్డిపల్లె, తిమ్మారెడ్డిపల్లె, కవలకుంట్ల, కొర పాటిపల్లె గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు నిర్వహించారు. ఖరీఫ్ 2022కు సంబంధించి పంట నమోదు కార్యక్రమం, సోషల్ ఆడిట్, ప్రతి గ్రామంలో జరగాలని. వచ్చిన అర్జీలను ఆనలైనలో అప్‌లోడ్ చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇనచార్జిలు రైతులకు అందుబాటులో ఉండాల న్నారు.