రొమ్ము కేన్సర్‌పై అవగాహన

ABN , First Publish Date - 2022-10-18T05:57:14+05:30 IST

ఆధునిక జీవన శైలి వల్ల మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని హెచ్‌సీజీ కేన్సర్‌ సెంటర్‌ అంకాలజిస్టు డాక్టర్‌ శ్రీ ఫణి అన్నారు.

రొమ్ము కేన్సర్‌పై అవగాహన
రొమ్ము కేన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు

రొమ్ము కేన్సర్‌పై అవగాహన 

మొగ ల్రాజపురం, అక్టోబరు 17: ఆధునిక జీవన శైలి వల్ల మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని హెచ్‌సీజీ కేన్సర్‌ సెంటర్‌ అంకాలజిస్టు డాక్టర్‌ శ్రీ ఫణి అన్నారు. జాతీయ రొమ్ము  కేన్సర్‌ దినం  హెస్‌సీజీ కేన్సర్‌ సెంటర్‌, కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల సంయుక్తంగా సోమవారం కళాశాలలో రొమ్ము  కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద రొమ్ము  కేన్సర్‌కు సంబంధించిన  పరీక్ష చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ విధంగా చేయడం వల్ల జబ్బును ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం పొందవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆచంట సునీత, కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఘంటా విజయకుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:57:14+05:30 IST