TDP Condolence : కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసింది

ABN , First Publish Date - 2022-11-15T10:28:57+05:30 IST

సినీనటుడు, నిర్మాత, మాజీ ఎంపీ, ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, టీడీపీ రాజ్యసభ లీడర్ కనకమెడల రవింద్ర కుమార్..

TDP Condolence : కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసింది

న్యూఢిల్లీ: సినీనటుడు, నిర్మాత, మాజీ ఎంపీ, ఘట్టమనేని కృష్ణ (Gattamaneni Krishna) మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, టీడీపీ రాజ్యసభ లీడర్ కనకమెడల రవింద్ర కుమార్ (Kanakamedala Ravindra kumar), టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత జయదేవ్ గల్లా (Jayadev galla), విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని (Kesineni nani), శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) నంతాపం తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, సూపర్‌స్టార్‌గా పిలిపించుకున్నారన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాత కృష్ణ అని కొనియాడారు. విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయిందని ఆవేదనం చెందారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబు (Mahesh babu)కు ఇది తీరని వేదనగా తెలిపారు. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు (TDP Leaders) ప్రగాఢ సానుభూతిని తెలియేశారు.

Updated Date - 2022-11-15T10:33:47+05:30 IST