Yanamala: సొంత మీడియాకు ఆదాయం సమకూర్చుకోవడమే జగన్ సంక్షేమం
ABN , First Publish Date - 2022-12-21T14:54:53+05:30 IST
పుట్టినరోజున సొంత మీడియాకు ఆదాయం సమకూర్చుకోవటమే జగన్ సంక్షేమం అని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
అమరావతి: పుట్టినరోజున సొంత మీడియాకు ఆదాయం సమకూర్చుకోవటమే జగన్ సంక్షేమం అని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramkrishnudu) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం జారీ అయిన విధివిధానాలను యధేచ్ఛగా ఉల్లంఘించి ఈ అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం (Jagan Government) కేవలం పుట్టినరోజు పేరుతో రూ.50 కోట్లు జేబులో వేసుకోవడం మహా దారుణమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రకటనల పేరిట కొనసాగుతున్న దోపిడీని ఆపివేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అప్పులతో అభివృద్ధి కుంటుపడి, ప్రజాజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ప్రతి రూపాయిని అతి జాగ్రత్తగా వినియోగించే విజ్ఞత ఇప్పటికైనా జగన్‌రెడ్డికి కలగాలని యనమల రామకృష్ణుడు అన్నారు.