Ayyanna Patrudu: ఉత్తరాంధ్రలో 16 వేల దొంగ ఓట్లు దొరికాయి..

ABN , First Publish Date - 2022-12-12T13:03:32+05:30 IST

ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాలో అవకతవకలు, అనర్హులకు ఓటు కల్పించడంపై విశాఖ జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేతలు (TDP Leaders) ఫిర్యాదు చేశారు.

Ayyanna Patrudu: ఉత్తరాంధ్రలో 16 వేల దొంగ ఓట్లు దొరికాయి..

విశాఖ: ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాలో అవకతవకలు, అనర్హులకు ఓటు కల్పించడంపై విశాఖ జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేతలు (TDP Leaders) ఫిర్యాదు చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu), ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు (Duvvarapu Ramarao), పల్లా శ్రీనివాస్ (Palla Srinivas), స్థానిక నేతలు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల దొంగ ఓట్లు తేలాయని, ఒక్క ఉత్తరాంధ్రలో 16 వేల దొంగ ఓట్లు దొరికాయన్నారు. ఇంటర్ పాస్ అయినా, ఫెయిలైన వారు కూడా ఓటర్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. సచివాలయం వాలంటీర్ల వ్యవస్ధ ఇందుకేనా పెట్టారని తీవస్థాయిలో దుయ్యబట్టారు. ఇలా దొంగ ఓట్లతో 175కు 175 సీట్లు గెలుస్తామని అంటున్నారా? అని నిలదీశారు. దొంగ ఓట్లపై విచారణ జరిపించమని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చామని, కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Updated Date - 2022-12-12T13:03:35+05:30 IST