అంతా సవ్యమేనా
ABN , First Publish Date - 2022-11-27T00:42:35+05:30 IST
అధికార పగ్గాలు చేపట్టి మూడున్నరేళ్లు కావస్తోంది. ప్రభుత్వంతోపాటు పార్టీ, కార్యకర్తల అవసరాలను తీర్చే విధంగా జిల్లా నాయకత్వాలు పనిచేయాలంటూ అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు.

కమిటీల్లో మార్పులు, చేర్పులపై సందేహాలు
పలుచోట్ల కుదుట పడని అధికార పార్టీ
మరిన్ని నియోజక వర్గాల్లో ఎదురుగాలి
హైప్యాక్ నివేదికపై జోరుగా ప్రచారాలు
విపక్ష నేత చంద్రబాబు టూర్‌పైనా నిఘా
అధికార పగ్గాలు చేపట్టి మూడున్నరేళ్లు కావస్తోంది. ప్రభుత్వంతోపాటు పార్టీ, కార్యకర్తల అవసరాలను తీర్చే విధంగా జిల్లా నాయకత్వాలు పనిచేయాలంటూ అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు. ఈ రెండింటి మధ్య సమన్వయం పార్టీని బలోపేతం చేస్తుందంటూ అందరికీ హితవు పలికారు. కాని, ఇప్పుడు ఓ వైపు అధికారం వెలగబెడుతుండగా, మరోవైపు జిల్లా నాయకత్వాలను రెండుసార్లు మార్చారు. ఉమ్మడి పశ్చిమలో దళితులకు అవకాశం లేకుండా అగ్రవర్ణాలకే అవకాశం కల్పించారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడుస్తోంది. అనేకమందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మరికొందరికి డైరెక్టర్లు, ఇంకొందరికి మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇలా ఒకటేంటి పదవుల పందారమే సాగింది. కానీ, నియోజ కవర్గ స్థాయిలో వీరంతా ఏ మాత్రం ప్రభావితం చేయలేక పోతున్నారు. అప్పటికీ జిల్లా నాయకత్వం వీరందరినీ ముందు వరుసలో నిలబెట్టి వివిధ వర్గాల మధ్య సమన్వయానికి ప్రయత్నం చేస్తే ఒట్టు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లా అధ్యక్షునిగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని సుదీర్ఘంగా కొనసాగారు. పార్టీ ఆవిర్భావం నుంచే ఆయ న జిల్లా పగ్గాలు అందుకుని ముఖ్య నేతల మధ్య ఒకింత సమన్వయం సాధించినా, మంత్రివర్గంలో చోటు సాధించిన తరువాత సమయాభావం పేరిట అందరికీ దూరమయ్యారు. ఆ సమయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబుకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఎప్పటికప్పుడు ఏమైనా సమస్య లుంటే మంత్రులతో సమన్వయపర్చుకుని పరిష్కరించే బాధ్య తను అప్పగించారు. ఇదంతా కొత్తలో కాస్తంత వేగంగానే సాగి నా ఆ తరువాత వెనుకబడింది. దీనికితోడు మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన వారందరికీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తా మని ప్రకటించిన జగన్ అన్నంత పనీచేశారు. కేవలం కొన్నాళ్ళ పాటే ఏలూరు జిల్లాకు పార్టీ పగ్గాలు మారినా తిరిగి యధా విధిగా ఆళ్ళ నాని మళ్ళీ ఫోకస్‌లోకి వచ్చారు. ఇప్పుడు తాజా గా జిల్లా అధ్యక్షులు మార్పులు, చేర్పులు పేరిట కసరత్తు సాగినా సీఎం జగన్ మాత్రం ఆళ్ళ నానిని వదిలి పెట్టలేదు. యధాతధంగా ఆయననే ఏలూరు జిల్లా అధ్యక్షునిగా కొనసాగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఆళ్ళ నానిని కాదని ఇంకొకరికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అను వైన నేతలు లేక ? కాదంటే సామాజిక సమతుల్యాలు దృష్టిలో పెట్టుకుని నానికే కేటాయించారని పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇమేజ్ ఈ మధ్యన ఒకింత తగ్గినట్టు ఐప్యాక్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. అలాగే గడపగడపకు ఆళ్ళ నాని సహా మిగతా ఎమ్మెల్యేలంతా శ్రమిస్తుండగానే ఒకటి, రెండు నియోజకవ ర్గాల్లో అనుకున్నంతగా అక్కడి సిట్టింగ్‌లు మైలేజ్ పెంచుకోలేక పోయారనే వాదనలు లేకపోలేదు.
నరసాపురంలో ఎప్పుడు సెటరైట్
నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో నిన్న మొన్నటి వరకు రంగరాజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు. ఆ తరువాత మంత్రి పదవి కోల్పోయి జిల్లా పార్టీ అధ్యక్షునిగా చెరుకువాడ రంగనాధరాజును నియమించారు. తిరిగి ఇప్పుడు మరోసారి ఆయననే కొనసాగించడమే కాకుండా ఇక ఇక్కడ మార్పులు, చేర్పులు లేవన్నట్టు తేల్చేశారు. వాస్తవానికి ఈ జిల్లాలో మంత్రులుగా కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి రెండు నియోజకవర్గాల్లోనూ ఏమాత్రం పట్టు సడలనీయకుండా కాస్తంత వేగం పెంచి ముందడుగు వేయాలని వీరిద్దరికీ పార్టీ నాయకత్వం చెప్పింది. వాస్తవానికి ఏలూరు జిల్లాతో పోలిస్తే భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమలో మాత్రం ఒకింత భిన్నమైన పరిస్థితులే ఉన్నాయి. ఈ జిల్లాలో గోకరాజు కుటుంబానికి ఒకింత పెద్దీ పట వేస్తూ కొన్నాళ్ళపాటు హవా కొనసాగేలా వైసీపీ జాగ్రత్తపడింది. ఆ తరు వాత క్రమేపీ మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చింది. ఇంతకుముందే జిల్లా అధ్యక్ష పదవి నుంచి గోకరాజు రంగరాజు(పెదబుజ్జి)ను తొలగించగా, ఆ తర్వాత ఉండి నియోజక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న గోకరాజు రామంను తప్పించారు. నరసాపురం నియో జకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పూర్తిగా గుర్రుగా ఉన్న సీఎం ఎట్టి పరిస్థితు ల్లోనూ ఆయనకు అక్కడ చోటు లేకుండా చేయడమే కాకుండా అంతకంటే మించి ‘శక్తివంతు’లను అన్వేషిస్తున్నారు. అందరినీ కలుపుకుపోవడమే కాకుండా కాస్తంత చురుగ్గా వ్యవహరించే మాజీమంత్రి రంగనాథరాజును ఈసారి ఎంపీగా పోటీలోకి దింపుతారని భావిస్తుండగా, దానికి తగ్గట్టుగానే ఆయనను మరోసారి జిల్లా పార్టీ అధ్యక్షునిగా యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇంకోవైపు నరసాపురం సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి అక్కడ అనువైన, బలమైన కాపు నేత కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్టు చెబుతున్నారు. టీడీపీలో కీలక ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నట్టు వైసీపీ ఇప్పటికే దుమారం రేపింది. దీని వెనుక గల కారణాలు వేరేనంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
హైప్యాక్ ... ఏం చెబుతోంది ?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతకు ముందు మాదిరిగానే వైసీపీ హవా కొనసాగుతుందా, లేకుంటే బలహీన పడిందా, తేరుకునేందుకు అవకాశాలు ఉన్నా యా, లేకుంటే కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల సీట్ల కిందకు నీళ్ళొస్తున్నాయా అంటూ అనేక ప్రశ్నలు వైసీపీలో లేకపోలేదు. ప్రత్యేకించి నరసాపురం పార్లమెంటు పరిధిలో పార్టీకి గతంలో ఉన్న ప్రయోజనాలకంటే ఈసారి మరింతగా తగ్గాయనేదే సమాచారం. హైప్యాక్ బృందం కూడా ఇదే తరహా సమాచారాన్ని అధిష్టానంకు చేరవేసినట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఏలూరు జిల్లాలోనూ సగానికి సగం మంది పరిస్థితి బలహీనంగా ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికితోడు విపక్ష నేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకించి ఈ పర్యటనలో కూడా ప్రజల నాడిని కనిపెట్టేందుకు వీలుగా వైసీపీ అనుకూల సర్వే బృందాలు రంగంలోకి దిగుతున్నాయి.
చింత తీర్చేదెవరు ?
పునఃప్రారంభిచాలని రైతులు కోరుతున్నారు. పరిహారం కోసం నిర్వాసిత రైతులు మూడున్నరేళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. రైతులకు పూర్తిగా పరిహారం ఇస్తేనే కాలువ తవ్వకం పనులు చేపట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉదాశీనతతో పనులు నిలిచిపోయాయి. ఆరు నెలల క్రితం భూనిర్వాసితులకు వైసీపీ ప్రభుత్వం రూ.35 కోట్లు విడుదల చేయడంతో చింతలపూడి ఫేజ్–2 పథకం ఎట్టకే లకు గాడిన పడుతోందని, నూజివీడు డివిజన్ ప్రాంతంలోని రైతులు భావించారు. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం నష్టపరిహారం విడుదల చేసి, మరికొన్ని ప్రాం తాలను వదిలేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాల ఆధారంగా రూపొందించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఫేజ్–1,–2 వల్ల ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ జిల్లాల్లో రెండున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ మూడో జోన్ అధిక భాగం తెలంగాణలో ఉండటం వల్ల కృష్ణా జలాలు ఆంధ్రా ప్రాంతానికి రావడం ప్రశ్నార్థకంగా మారుతున్న సమయాల్లో ఈ ప్రాంతాలను గోదావరి జలాల ద్వారా సస్యశ్యామలం చేస్తూ, కృష్ణా జలాలను అటు రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం ఇవి పూర్తవ్వడం ద్వారా ఏర్పడుతోంది. ఈ పథకాలు మూలకు చేరడంతో రెండు ప్రాంతాలకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది.