రూ.15,000కే లాప్టాప్!
ABN , First Publish Date - 2022-10-04T09:11:40+05:30 IST
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.15,000కే లాప్‌టా్‌పను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.

త్వరలో విడుదల చేయనున్న రిలయన్స్ జియో
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.15,000కే లాప్‌టా్‌పను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జియో బుక్ పేరుతో కంపెనీ దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని.. దేశంలోని అత్యంత చౌక లాప్టాప్ మోడళ్లలో ఒకటి కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 4జీ సిమ్‌కార్డుతో కూడిన జియో బుక్‌ను ఈ నెలలోనే పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు అందుబాటులోకి తేనున్నట్లు వారు వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో కంపెనీ దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనుందన్నారు.
క్వాల్కామ్ చిప్స్, జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో దేశీయంగా తయారు చేస్తున్న జియో బుక్‌లో మైక్రోసా్‌ఫ్టకు చెందిన కొన్ని యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. జియో ఫోన్ పేరుతో రిలయన్స్ లాంచ్ చేసిన అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఇక లాప్‌టా్‌పల విభాగంలోనూ అదే తరహా విజయాన్ని దక్కించుకోవాలని రిలయన్స్ జియో భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయ ల్యాప్‌టాప్ మార్కె ట్లో వార్షిక విక్రయాలు 1.40 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉన్నాయని.. జియో బుక్ ప్రవేశంతో సేల్స్ మరో 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ అనలిస్ట్ తరుణ్ పాథక్ అభిప్రాయపడ్డారు. ఈ మార్కె ట్లో హెచ్‌పీ, డెల్ కంపెనీలదే హవా. కాగా, ఏసర్, లెనెవో, లావా వంటి కంపెనీలు తక్కువ ధరలో లాపీలను విక్రయిస్తున్నాయి. జియో బుక్ ప్రఽధానంగా ఈ మూడు కంపెనీల మోడళ్లకు గట్టిపోటీనివ్వనుందని పాథక్ పేర్కొన్నారు.