Raj tarun: ఒసేయ్ నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా..
ABN , First Publish Date - 2022-10-30T19:24:09+05:30 IST
‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పాపురల్ అయ్యాడు రాజ్‌తరుణ్. తొలి సినిమా సక్సెస్‌తో అవకాశాలు వరుస కట్టాయి. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత సరైన విజయం అందుకోలేకపోయాడు.
‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పాపురల్ అయ్యాడు రాజ్‌తరుణ్(Raj tarun). తొలి సినిమా సక్సెస్‌తో అవకాశాలు వరుస కట్టాయి. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత సరైన విజయం అందుకోలేకపోయాడు. తాజాగా ‘స్టాండప్ రాహుల్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ యువ హీరో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాజ్ ఫ్రస్ట్రేషన్‌తో కనిపిస్తున్నాడు. (Raj tarun Frustration)‘‘ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికి హానికరం. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి’ అనే శీర్షికతో రాజ్‌తరుణ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో ఏముందంటే...(#inkaledhu)
‘‘సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికి కారణముంది. మీకో అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయి గురించి టాపిక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అంతా గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంటేసుకుని తిరుగుతుంటే.. నేను మాత్రం.. ఇంట్లో అమ్మకు కొత్తిమీర, కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగివాణ్ణి. ఫ్రెండ్స్‌ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. నా జీవితానికి ప్రేమ సెట్ కాదని అర్థమైపోయింది. నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. మొదట కంగారు పడ్డారు. తర్వాత నా కరువు అర్థం చేసుకుని మంచి సంబంధం చూశారు. అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురామ్మా అనగానే ఆ అమ్మాయి చెల్లెలు ఓ లెటర్ తీసుకుని వచ్చింది. అంటే అమ్మాయి జంప్. చుట్టాలంతా చచ్చిన పాముని ఇంకా చంపేలా నాపై సానుభూతి మొదలెట్టారు. వాళ్లను కాదు.. అసలు దాన్ని అనుకోవాలి! ఒసేయ్ నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా. రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా. ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పిండి’’ అంటూ రాజ్‌తరుణ్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తను నటించబోయే తాజా చిత్రం ప్రమోషన్ కోసమని తెలుస్తోంది. అయితే ఏ చిత్రం అనేది ఆయన వివరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.