Superstar Krishna: ‘బాధ పడొద్దు.. వారిద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు’

ABN , First Publish Date - 2022-11-15T12:37:16+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. తెలుగులో సూపర్‌స్టార్ అయినప్పటికీ కోలీవుడ్‌లోనూ ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు..

Superstar Krishna: ‘బాధ పడొద్దు.. వారిద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు’

సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. తెలుగులో సూపర్‌స్టార్ అయినప్పటికీ కోలీవుడ్‌లోనూ ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో రజనీకాంత్, కమల్ హాసన్‌లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఆయన మరణ వార్త తమని ఎంతో కలిచివేసిందంటూ ఈ స్టార్స్ ఇద్దరూ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. అలాగే.. ప్రతి విషయం మీద తన దైన శైలిలో ఫన్నీగా స్పందించే రామ్ గోపాల్ వర్మ, కృష్ణ మృతిపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే మరికొందరూ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

టాలీవుడ్‌కి తీరని లోటు..

‘కృష్ణ గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించడం నాకున్న మధురానుభూతులు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’

- రజనీకాంత్

ఒక శకం ముగిసింది..

‘తెలుగు సినిమా ఐకాన్ కృష్ణ గారు ఇక లేరు. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తల్లి, సోదరుడు, ఇప్పుడు తన తండ్రిని కోల్పోయి దు:ఖంలో ఉన్న సోదరుడు మహేశ్ బాబు బాధని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రియమైన మహేశ్‌కి నా ప్రగాఢ సానుభూతి’

- కమల్‌హాసన్

నిజమైన సూపర్‌స్టార్..

కృష్ణగారి మరణ వార్త విని గుండె పగిలిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మాటల్లో వర్ణించలేనిది. అన్ని విధాలుగా నిజమైన సూపర్ స్టార్. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’

- అల్లు అర్జున్

స్వర్గం పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తారు..

‘బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ గారు, విజయనిర్మలగారు స్వర్గంలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను’

- రామ్ గోపాల్ వర్మ

Updated Date - 2022-11-15T12:37:18+05:30 IST

News Hub