Mahesh Babu: కృష్ణ గారి పెద్ద కర్మ రోజు అభిమానులను కలవనున్న మహేష్ బాబు

ABN , First Publish Date - 2022-11-23T12:54:32+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ ఈ ఆదివారం నాడు జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరుగుతున్నట్టు తెలిసింది. ఈ పెద్ద కర్మకి మహేష్ బాబు, అతని చిన్నాన్న ఆదిశేషగిరి రావు వస్తారని తెలిసింది.

Mahesh Babu: కృష్ణ గారి పెద్ద కర్మ రోజు అభిమానులను కలవనున్న మహేష్ బాబు
File picture of Mahesh Babu and his uncle Adiseshagiri Rao

సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ ఈ ఆదివారం నాడు జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరుగుతున్నట్టు తెలిసింది. ఈ పెద్ద కర్మకి మహేష్ బాబు, అతని చిన్నాన్న ఆదిశేషగిరి రావు వస్తారని తెలిసింది. అలాగే అదే రోజు కృష్ణ, మహేష్ బాబు అభిమానులను మహేష్ బాబు కలుస్తారని కూడా తెలిసింది. కృష్ణ గారి అస్తికలు విజయవాడ వెళ్లి కృష్ణ నదిలో కలిపి వచ్చిన మహేష్ బాబు మిగతా కర్మలు అన్నీ కూడా పద్మాలయ స్టూడియోస్ లో చేస్తున్నట్టు తెలిసింది. కృష్ణ గారి కుటుంబానికి పరిచయం వున్నా చిత్ర పరిశ్రమ నుండి కొంతమంది పెద్దలు రోజూ వచ్చి పద్మాలయ స్టూడియోస్ లో మహేష్ బాబు ని కలుస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఈ కార్యక్రమం లో భాగంగానే 27వ తేదీన పెద్ద కర్మకి అభిమానులను కూడా ఆహ్వానించాలని అనుకున్నట్టుగా తెలిసింది. కృష్ణ గారి అంత్యక్రియలు రోజు, చాలామంది అభిమానులు ఎక్కడెక్కడ ఊర్ల నుండో వచ్చి అతన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. కానీ చాలామంది చూడలేకపోయారు. అందుకని పెద్ద కర్మ జరుగుతున్న ఈ నెల 27వ తేదీన అభిమానులను మహేష్ బాబు స్వయంగా కలిసే అవకాశం వుంది అని కూడా అంటున్నారు.

Updated Date - 2022-11-23T13:58:23+05:30 IST

News Hub