సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..
ABN , First Publish Date - 2022-11-14T15:43:01+05:30 IST
అతడికి అప్పటికే వివాహమైంది. అయినా ఆ విషయం దాచిపెట్టి.. ఆఫీసులో తన సహోద్యోగితో ప్రేమాయణం నడిపాడు. అతడి మాయమాటలు నమ్మిన యువతి.. తననే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఇటీవల ఓ రోజు..
అతడికి అప్పటికే వివాహమైంది. అయినా ఆ విషయం దాచిపెట్టి.. ఆఫీసులో తన సహోద్యోగితో ప్రేమాయణం నడిపాడు. అతడి మాయమాటలు నమ్మిన యువతి.. తననే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఇటీవల ఓ రోజు ఆమెకు అసలు విషయం తెలిసిపోయింది. ఎందుకు నన్ను మోసం చేశావ్.. అంటూ ప్రియుడిని నిలదీసింది. ‘‘ఇక మీద నీకు, నాకు ఎలాంటి సంబంధమూ లేదు’’.. అని తేల్చి చెప్పేసింది. ఈ మాటతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు తక్కువ అవడంతో దంపతుల దుస్తుల్లో వెతికి.. చివరకు భర్త ముందే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా పరిధికి చెందిన గౌరవ్.. స్థానికంగా ఉన్న ఓ బీమా కంపెనీలో పని చేస్తుంటాడు. అక్కడ అతడికి 22ఏళ్ల ఓ యువతి (young woman) పరిచయమైంది. సహోద్యోగి కావడంతో గౌరవ్‌తో ఆమె సన్నిహితంగా ఉండేది. అప్పటికే తనకు వివాహమైనా.. ఆ విషయాన్ని దాచిపెట్టాడు. వీరి పరిచయం కాస్త.. కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో గౌరవ్‌కు వివాహం అయిన విషయం ఆమెకు తెలిసింది. దీంతో ‘‘నన్ను ఎందుకు మోసం చేశావ్’’.. అని నిలదీసింది. అప్పటి నుంచి అతడికి బ్రేకప్ (Love breakup) చెప్పేసింది. అయితే గౌరవ్ మాత్రం తననే ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతుండేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌరవ్‌ను స్టేషన్‌కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై ఆమెను వేధించనని లిఖితపూర్వకం రాయించుకుని పంపించేశారు.
మద్యానికి బానిసైన భర్త.. భార్య వల్లే అలా జరిగిందని అనుమానం.. చివరకు ఓ రోజు రాత్రి..
కొన్నాళ్లు సక్రమంగా ఉన్న అతను.. మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. మంగళవారం వారి కార్యాలయంలోని మూడో అంతస్తులో ఆమెను కలుసుకున్నాడు. తాను చెప్పినట్లు వినాలంటూ బెదిరించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఆమెను పైనుంచి కిందకు తోసేశాడు. తర్వాత కిందకు వచ్చి.. ఆమె తన బంధువంటూ అందరినీ నమ్మించి, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే ఘజియాబాద్‌తో నోయిడా సరిహద్దులో ఉన్న లాల్ కువాన్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని మీరట్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను బుక్ చేసుకున్నాడు. అప్పటికే అతడి కోసం గాలిస్తున్న పోలీసులు.. బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.
గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కొడుకు.. భార్య ప్రోత్సాహంతో.. తల్లి అని కూడా చూడకుండా..