FIFA World Cup: గ్రూప్-ఇలో పరిస్థితి ఇదీ.. స్పెయిన్, జర్మనీ ఫేవరెట్లే కానీ..

ABN , First Publish Date - 2022-12-01T21:35:42+05:30 IST

ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup)లో ఇప్పటి వరకు పూర్తిగా ‘గ్రూప్ ఆఫ్ డెత్’ లేనప్పటికీ గ్రూప్-ఇ నిండా కావాల్సినన్ని

FIFA World Cup: గ్రూప్-ఇలో పరిస్థితి ఇదీ.. స్పెయిన్, జర్మనీ ఫేవరెట్లే కానీ..
fifa world cup 2022

ఖతర్: ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup)లో ఇప్పటి వరకు పూర్తిగా ‘గ్రూప్ ఆఫ్ డెత్’ లేనప్పటికీ గ్రూప్-ఇ నిండా కావాల్సినన్ని ట్విస్టులు ఉన్నాయి. కోస్టారికా చేతిలో ఓడిపోవడానికి ముందు జర్మనీని జపాన్ 2-1తో ఓడించింది. అంతకుముందు స్పెయిన్ చేతిలో కోస్టారికా 7-0తో ఓడింది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 1-1తో డ్రా చేసుకోగలిగింది. గ్రూపులో స్పెయిన్, జర్మనీ జట్లే ఫేవరెట్ అయినప్పటికీ మొత్తం నాలుగు జట్లు రేసులోనే ఉన్నట్టు. కాబట్టి గ్రూప్-ఇలో ఏదైనా జరిగే అవకాశం ఉంది.

రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాలంటే..

స్పెయిన్: రెండు మ్యాచుల్లో 4 పాయింట్లతో స్పెయిన్ టేబుల్ టాపర్‌గా ఉంది. అంతమాత్రాన అది రౌండ్ 16కు అర్హత సాధిస్తుందా? అంటే అనుమానమే. స్పెయిన్ తన చివరి మ్యాచ్‌‌లో ఇప్పటికే జర్మనీని ఓడించిన జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసినా, విజయం సాధించినా స్పెయిన్ తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఆ జట్టుకు తీరని వేదన మిగలడం ఖాయం. ఒకవేళ జపాన్.. స్పెయిన్‌ను, కోస్టారికా.. జర్మనీని ఓడిస్తే స్పెయిన్ ఇంటికెళ్లడం ఖాయం.

జపాన్: జర్మనీని 2-1తో ఓడించిన జపాన్.. కోస్టారికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్పెయిన్‌పై గెలిస్తే నేరుగా రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధిస్తుంది. కోస్టారికా-జర్మనీ మ్యాచ్ డ్రాగా ముగిస్తే కూడా సరిపోతుంది. అయితే, స్పెయిన్‌ చేతిలో ఓడితే మాత్రం జపాన్ నిష్క్రమిస్తుంది.

కోస్టారికా: స్పెయిన్ చేతిలో 7-0తో ఓటమి కోస్టారికా క్వాలిఫికేషన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. అయితే, రెండో మ్యాచ్‌లో జపాన్‌ను మట్టికరిపించడం ద్వారా మళ్లీ రేసులోకి వచ్చింది.ఇప్పుడు కోస్టారికా క్వాలిఫై కావాలంటే జర్మనీని ఓడించాలి. ఒకవేళ స్పెయిన్ తమ చివరి మ్యాచ్‌లో జపాన్‌ను ఓడిస్తే, జర్మనీతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సరిపోతుంది.

జర్మనీ: గ్రూపులో అట్టడుగున ఉన్న జర్మనీ ఖాతాలో ఒక్క పాయింటు మాత్రమే ఉంది. ఇప్పుడు దాని పరిస్థితి గమ్మత్తుగా ఉంది. అయితే, కోస్టారికాతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే మళ్లీ రౌండ్ ఆఫ్ 16 రేసులోకి వచ్చేస్తుంది. అయితే, అక్కడితో అయిపోలేదు. జపాన్‌పై స్పెయిన్ విజయం సాధిస్తే అది జర్మనీకి లాభిస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కనుక డ్రా అయితే కనుక కోస్టారికాను కనీసం రెండు గోల్స్ తేడాతో ఓడిస్తేనే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధిస్తుంది.

Updated Date - 2022-12-01T21:40:07+05:30 IST