షమికి కొవిడ్‌ ఆసీస్‌ సిరీస్‌ నుంచి అవుట్‌

ABN , First Publish Date - 2022-09-18T09:45:27+05:30 IST

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి కరోనా బారినపడ్డాడు. దీంతో మంగళవారం నుంచి స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సకు అతను దూరమయ్యాడు.

షమికి కొవిడ్‌  ఆసీస్‌ సిరీస్‌ నుంచి అవుట్‌

జట్టులోకి ఉమేశ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి కరోనా బారినపడ్డాడు. దీంతో మంగళవారం నుంచి స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సకు అతను దూరమయ్యాడు. షమి స్థానంలో వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకొచ్చాడు. ఉమేశ్‌ చివరి టీ20ని 2019లో ఆసీ్‌సతో ఆడాడు. ’షమి పాజిటివ్‌గా తేలాడు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనికి కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఐసొలేషన్‌లో ఉన్న షమి నెగటివ్‌గా తేలిన వెంటనే జట్టుతో చేరతాడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.  

Updated Date - 2022-09-18T09:45:27+05:30 IST