నిధులు నీళ్లపాలు
ABN , First Publish Date - 2022-04-25T06:29:07+05:30 IST
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా సూర్యాపేట జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకుడు, శాస్త్రవేత్త ఘంటా గోపాల్‌రెడ్డి ఆఽధ్వర్యంలో 1967లో మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (ఎల్-27)ను ప్రారంభించారు. దీంతో పెన్‌పహాడ్ మండలంలోని లింగాల, దూపహాడ్, గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లితోపాటు 41 గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా సుమారు 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించారు.

ప్రభుత్వం మంజూరు చేస్తున్నా అభివృద్ధి శూన్యం
కాలం చెల్లిన మోటార్లతో నీటి ఎత్తిపోత
అధ్వాన్నంగా మారిన పిల్లకాల్వలు
నిధుల వినియోగంపై తనిఖీలు కరువు
లక్ష్యం నెరవేరని మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం
ఘంటా గోపాల్‌రెడ్డి ఆశయాలకు తూట్లు
సూర్యాపేట సిటీ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా సూర్యాపేట జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకుడు, శాస్త్రవేత్త ఘంటా గోపాల్‌రెడ్డి ఆఽధ్వర్యంలో 1967లో మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (ఎల్-27)ను ప్రారంభించారు. దీంతో పెన్‌పహాడ్ మండలంలోని లింగాల, దూపహాడ్, గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లితోపాటు 41 గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా సుమారు 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించారు. గోపాల్‌రెడ్డి మరణాంతరం ఈ ఎత్తిపోతలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అభివృద్ధి కుంటుపడింది. కాలం చెల్లిన మోటర్లు, దెబ్బతిన్న ప్రధాన కాల్వ, ఆనవాళ్లు కోల్పోతున్న పిల్ల కాల్వల కారణంగా ప్రస్తుతం 6వేల ఎకరాలకే పరిమితమైంది.
మహ్మాతాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎల్-27) నిర్వహణ, కాల్వల పూడిక తీత, సిమెంట్ లైనింగ్, యంత్రాల మరమ్మతులకు ప్రభుత్వం ఏటా నిఽధులు మంజూరీ చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పనులు కనిపించడంలేదు. పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో ఎల్-27 కాల్వపై సింగల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి 2018, డిసెంబరు 28న ప్రభుత్వం రూ.7,01,685 మంజూరు చేసింది. సిమెంట్ లైనింగ్ కోసం రూ.15,75,219 విడుదలయ్యాయి.
అదే విధంగా ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న పిల్లకాల్వల మరమతులకు 2019 మే 30న రూ.7,66,745 మంజూరయ్యాయి. మోటార్ల మరమ్మతుకు 2020 జనవరి 8న రూ.3,91,388, సాగర్ కాల్వ నుంచి నీటిని ఎత్తిపో సే పుట్‌బాల్ పైప్ మరమ్మతు కు రూ.7,20,755, విద్యుత్ ప్యానళ్ల మరమ్మతుకు 2020 సెప్టెంబరు 28న రూ.7,20,755 విడుదలయ్యా యి. అయితే ప్రభుత్వం ఏటా నిధులు విడుదలచేస్తు న్నా, అభివృద్ధి మాత్రం కానరావడం లేదు.
అధ్వాన్నంగా కాల్వలు
ఎల్-27 కాల్వకు అనుసంధానంగా ఉన్న సుమారు 20కి పైగా పిల్లకాల్వల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కొన్నిచోట్ల పిల్లకాల్వలను కొంతమంది రైతులు కబ్జా చేశారు. మరికొన్ని చోట్ల కాల్వ ఆనవాళ్లే లేవు. ఫలితంగా నీరు విడుదలచేసినప్పుడు పంట పొలాల్లోకి చేరుతోంది. పిల్లకాల్వల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాల్వలకు షెట్టర్లు లేవు. కాల్వలు కంపచెట్టు, నాచు, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి.
పనులపై తనిఖీలేవీ?
ఎల్-27 ఎత్తిపోతల నిర్వహణను పర్యవేక్షించేందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ఒక చైర్మన్, 10మందికి పైగా డైరెక్టర్లు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో పథకం నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, నిధుల వినియోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఎత్తిపోతల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా ప్రాజెక్టు ప్రారంభం నుంచి నేటి వరకు ఎలాంటి అడిట్ నిర్వహించలేదు. పనులను తనిఖీచేసేవారు కరువయ్యారు. దీంతో నిధులు పక్కదారిపట్టినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
కాలంచ ెల్లిన మోటార్లు
ప్రాజెక్టు ప్రారంభించిన తొలినాళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లతోనే నేటికీ నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంలో మొత్తం 11 మోటార్లు బిగించగా, వాటిలో కేవలం 7మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 4 మోటా ర్లు మరమ్మతుకు గురయ్యాయి. 7మోటార్లు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మోటార్లు కా లం చెల్లినవి అయినా, నిరంతరం మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారే తప్ప కొత్తవి కొనుగోలు చేయడం లేదు. విద్యుత్ ప్యానళ్ల పరిస్థితి సైతం అలాగే ఉంది.
నిధులు విడుదల వాస్తవమే : కుర్మయ్య, ఏఈఈ, ఎల్-27పథకం,గడ్డిపల్లి
మహ్మాతాగాంధీ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదలచేసిన విషయం వాస్తవమే. వాటిని పథకం అభివృద్ధి పనులకు వినియోగించాం. కోట్ల రూపాయాలకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు విడుదలచేస్తుండటంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదు.