YCP: తిరువూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2023-08-31T13:14:18+05:30 IST

తిరువూరు వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా అసమ్మతి బయటపడింది.

YCP: తిరువూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసీపీలో (YCP) విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా అసమ్మతి బయటపడింది. తిరువూరు పురపాలక సంఘం సమావేశానికి Tiruvuru Municipal Council meeting ) అధికార పార్టీకి చెందిన 17 మంది వైసీపీ సభ్యులకు 16 మంది గైర్హాజరయ్యారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పర్సన్ గత్తం కస్తూరిభాయి ఏకాకిగా మిగిలిపోయారు. టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు. కోరం పూర్తి కాకపోవడంతో చైర్‌పర్సన్ సమావేశాన్ని వాయిదా వేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి రెండేళ్ల ఒప్పందం అమలు చేయాలని ఇటీవల చైర్‌పర్సన్‌పై అసమ్మతి వర్గం సభ్యులు తిరుగుబావుటా ఎగురవేసి విషయం తెలిసిందే. అధికార పార్టీ సభ్యుల తీరు పట్ల టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరువూరు పట్టణంలో అభివృద్ధి విస్మరించి అధికార పార్టీ సభ్యులు కుర్చీ కోసమే కొట్లాడుకుంటున్నారని తెలుగుదేశం సభ్యులు మండిపడ్డారు. తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి అధికార వైసీపీ సభ్యులు హాజరుకాని పరిస్థితి. పట్టణంలో ప్రజా సమస్యలు గాలికొదిలేసి సమావేశానికి హాజరుకాకుండా అధికార పార్టీ సభ్యులు డుమ్మా కొట్టారు. నగర పంచాయతీలో కుర్చీ కోసం అధికార పార్టీ సభ్యులు హాజరుకాకుండా తమ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-31T13:14:18+05:30 IST