Vote cancellation case: ఉరవకొండలో ఓట్ల తొలగింపు.. మరో ఉన్నతాధికారి సస్పెండ్
ABN , First Publish Date - 2023-08-21T12:14:09+05:30 IST
ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది.
అనంతపురం: ఉరవకొండలో ఓట్ల తొలగింపు (Vote cancellation case) వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురంలో నాడు జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అవగా.. భాస్కర్ రెడ్డికి ముందు అదే స్థానంలో పనిచేసిన స్వరూపా రాణీ పైనా సస్పెన్షన్ వేటు పడింది. గతంలో అనంత జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపునకు బాధ్యురాలిని చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఈటీసీ(Extension training centre (ETC)) కు గెజిటెడ్ ఇన్ స్ట్రక్టర్‌గా స్వరూపారాణి పనిచేస్తున్నారు. 2021లో అనంతపురం జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో అక్రమంగా 1796 ఓట్ల తొలగింపుపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Urvakonda MLA Payyavula Kesav) ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. తాజా చర్యలతో అధికార పార్టీ కోసం నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన అధికారుల్లో తీవ్ర కలవరం మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపు పాపం తమ మెడకు చుట్టుకుంటుదనే ఆందోళనలో అధికారులు ఉన్నారు.