వైసీపీని చిత్తుగా ఓడించండి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:33 AM
సైకో జగనరెడ్డి నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశమైందని, రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ నియోజకవర్గం ఇనచార్జి బండారు శ్రావణీశ్రీ పిలుపునిచ్చారు.

బుక్కరాయసముద్రం, డిసెంబరు 29: సైకో జగనరెడ్డి నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశమైందని, రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ నియోజకవర్గం ఇనచార్జి బండారు శ్రావణీశ్రీ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక విరుపాక్షిశ్వేశ్వర నగర్‌లో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రగతి మళ్లీ పరుగులు పెట్టాలంటే చంద్రబాబును సీఎంగా చేయడం వల్లే సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలు, అక్రమ ఇసుకతో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి ఏ మాత్రం కనిపించలేదని, సిగ్గు లేకుండా మరో సారి వైసీపీకి ఓట్లు వేయాలని ఆ పార్టీ నేతలు అడగడం విడ్డురంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీజీ జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల హనుమంతురెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, జీసీ బాబు, ఓబులపతి, చిదానందా నాయుడు,పెద్దప్ప పాల్గొన్నారు.