మరో రూ. 1000 కోట్ల అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-09-21T22:08:32+05:30 IST
ఏపీ ప్రభుత్వం మళ్లీ రూ. 1000 కోట్ల అప్పు తెచ్చింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం మళ్లీ రూ. 1000 కోట్ల అప్పు తెచ్చింది. బాండ్ల వేలం ద్వారా 13 సంవత్సరాలకు 7.44 శాతం వడ్డీకి జగన్ సర్కారు అప్పు తీసుకుంది. ఈ వెయ్యి కోట్ల రూపాయలతో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం రూ. 61 వేల 500 కోట్లు అప్పు తెచ్చింది.
ఈ నెల 19న మంగళవారం మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆర్బీఐ (RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద ఏపీ అప్పు రూ.41,500 కోట్లకు చేరింది. బాండ్ల వేలం గురువారం (21న) జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ముందే ప్రకటించింది. తాజాగా ఏపీకి మరో వెయ్యి కోట్ల అదనపు అప్పుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ.20 వేల కోట్ల అప్పు ఏపీ ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు ఏపీ అప్పు మొత్తం రూ.61,500 కోట్లకు చేరింది. 6 నెలల్లోనే రూ.61,500 కోట్ల అప్పుతో ఏపీ రికార్డ్ సాధించింది.