Ayyanna Patrudu: సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-01T21:17:17+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagant) తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విమర్శలు గుప్పించారు.
తూర్పుగోదావరి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagant) తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విమర్శలు గుప్పించారు.
"పాదయాత్రలో మోసం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజల్లోకి వస్తే జగన్‌ను తన్నుతారు. చెప్పుతో కొడతారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్న జగన్ ప్రజల్లో తిరగటానికి ఎందుకు భయపడుతున్నాడు. బ్రాందీ షాపులపై అప్పు తెచ్చిన ఘనుడు జగన్. విశాఖపట్నంలో రూ. 25 వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు జగన్ తాకట్టు పెట్టాడు. గోదావరి వరద బాధితులను పరామర్శించేనాదుడే లేడు." అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
"విజయసాయి రెడ్డి విశాఖను సర్వనాశనం చేశాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 45 వేల కోట్లు విలువ చేసే భూములను బలవంతంగా విజయసాయి రెడ్డి లాక్కున్నాడు. భూముల దోపీడీపై దమ్ముంటే విజయసాయి రెడ్డి చర్చకు వస్తాడా?. తండ్రి, కొడుకులు పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డిలు గనులను దోచుకుంటున్నారు. భారతి సిమెంట్ ను అధిక ధరలకు కొనుగోలు చేసి జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారు. జగన్ ది క్రిమినల్ బుర్ర, జగన్ జైలుకి వెళితే అప్పులు ఎవడు తీర్చుతాడు. ఏపీ భవిష్యత్తు కోసం రాక్షసుడు జగన్‌ను ఇంటికి పంపాలి." అని మండిపడ్డారు.