AP News: ఎంతటి ఘోరం.. యువకుడి డెడ్‌బాడీ డోర్ డెలివరీ
ABN , First Publish Date - 2023-08-25T15:55:46+05:30 IST
జిల్లాలోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యువకుడి మృతదేహాన్ని ఏకంగా డోర్ డెలివరీ చేసిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు భాగస్వాములు కావడం మరింత ఆందోళన కలిగించింది. మృతుడు గుడిపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన వినోద్‌గా గుర్తించారు. గ్రామానికి చెందిన వినోద్ గురువారం సాయంత్రం 4 గంటల తన నివాసం నుంచి కుప్పంకు బయలుదేరాడు. అయితే కుప్పం పట్టణంలో ప్యాలెస్ రోడ్డులో ఉన్న ఒక లాడ్జిలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో వినోద్ మృతి చెందాడు. ఇద్దరు మహిళలు వినోద్ ఆరోగ్యం బాగలేదంటూ అంబులెన్సులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వినోద్ మృతి చెందాడు. దీంతో ఇద్దరు మహిళలు కలిసి యువకుడి మృతదేహాన్ని డోర్‌డెలివరీ చేశారు. కాగా వినోద్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు డోర్ డెలివరీ చేసిన మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే యువకుడి మృతికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.