Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యట షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Dec 28 , 2023 | 07:47 AM
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు శ్రేణులు సమయత్తమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. జనవరి 11న నరసరావుపేటలో పవన్‌తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు శ్రేణులు సమయత్తమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. జనవరి 11న నరసరావుపేటలో పవన్‌తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు. చివర్లో అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి సభ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు.
కాగా గురువారం నుంచి చంద్రబాబు మూడు రోజులు పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. రోజుకు రెండు సభలను పెట్టి జనవరి చివరినాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఐదో తేదీన తణుకులో జరిగే సభతో ప్రారంభమవుతుంది.
ప్రముఖుల కుటుంబాలకు ఒక సీటు ఇవ్వాలనే టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ఒక సీటు మాత్రమే ఇచ్చే అవకాశముంది. ఉమ్మడి కడప జిల్లాలోని రెడ్డప్ప రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి కూడా ఒక సిటే.. ఈ నియమం నుంచి దివంగత నేత ఎర్రమనాయుడు కుటుంబానికి చెందిన అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు కుటుంబాలకు మినహాయింపు ఉన్నట్లు సమాచారం.
కుప్పంలో 28, 29, 30 తేదీలలో జరిగే చంద్రబాబు పర్యటన వివరాలు..
28వ తేది సాయంత్రం 4.00 గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండులో బహిరంగ సభ, 6.00: కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం. రాత్రి 8.00: మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. రాత్రి 8.45: కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు.
29వ తేదీ ఉదయం 11.50 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ, మధ్యాహ్నం 3.00: రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్‌లో బహిరంగ సభ, సాయంత్రం 5.15: కుప్పంలోని ఎంఎం ఫంక్షన్ హాలులో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం, 6.15: బీసీఎన్ కన్వెన్షన్ హాలులో టీడీపీ నేతలతో సమావేశం, రాత్రి 8.30: కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు.
30వ తేది మధ్యాహ్నం 12.20 గంటలకు పీఈఎస్ సమీపంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస విగ్రహావిష్కరణ, బహిరంగ సభ, 2.20: కుప్పం పట్టణంలోని అన్నక్యాంటీన్ సందర్శన, 2.45: పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో పూజలు. 3.30: కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లింమైనారిటీలతో ముఖాముఖి కార్యక్రమం, సాయంత్రం 4.30: కుప్పం మండలం మల్లానూరు ఆర్టీసీ బస్టాండులో బహిరంగ సభ నిర్వహిస్తారు.