మోహన్‌బాబును కలిసిన పులివర్తి నాని
ABN , First Publish Date - 2023-04-07T01:07:09+05:30 IST
సినీ నటుడు, ఎంబీయూ చాన్స్‌లర్ డాక్టర్ మోహన్ బాబును టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పులివర్తినాని కలిశారు.

చంద్రగిరి, ఏప్రిల్ 6: సినీ నటుడు, ఎంబీయూ చాన్స్‌లర్ డాక్టర్ మోహన్ బాబును టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పులివర్తినాని కలిశారు. గురువారం ఏ.రంగం పేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరపల్లి హేమాంబరధరరావు, చంద్రగిరి, తిరుపతిరూరల్ టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, ఈశ్వర్ రెడ్డి, నాయకులు మధు, శ్రీధర్‌నాయుడు, కొండూరు ప్రవీణ్, గౌస్‌బాషా, దనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.