TTD Chairman: శ్రీవాణి ట్రస్ట్‌పై అసత్య ఆరోపణలు..శ్వేతపత్రం విడుదల చేస్తాం

ABN , First Publish Date - 2023-06-19T15:00:34+05:30 IST

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌‌‌కు సంబంధించిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

TTD Chairman: శ్రీవాణి ట్రస్ట్‌పై అసత్య ఆరోపణలు..శ్వేతపత్రం విడుదల చేస్తాం

తిరుమల: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌‌‌కు సంబంధించిన వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 2445 ఆలయాలని నిర్మాణం చేశామన్నారు. 250 పురాతన ఆలయాలకీ మరమ్మత్తులు చేశామని తెలిపారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడ దుర్వినియోగం కాలేదన్నారు. దాత ఇచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇస్తున్నామని అన్నారు. శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని.. కేసులు నమోదు చేసి..కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-06-19T15:10:15+05:30 IST