పొలంబాట పట్టిన అధికారులు

ABN , First Publish Date - 2023-02-09T00:13:57+05:30 IST

కలెక్టర్‌ ఆదేశాల మేరకు మం డల గ్రామాల్లో బుధవారం జిల్లాస్థాయి అధికారులు పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అరట్లకట్ట, కూరాడ, వాకాడ, వేములవాడ, కరప తదితర గ్రామాల్లో సాగునీటి ఎద్దడితో పొలాలు ఎండిపోతున్నాయి. దీనిపై ఆయా గ్రామాల రైతులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలోని సాగునీటి దుస్థితిని కన్నబాబు నేరుగా కలెక్టర్‌కు వివరించారు

పొలంబాట పట్టిన అధికారులు
అరట్లకట్టలో నీరందడంలేదని జేడీఏకు విన్నవించుకుంటున్న రైతులు

ఎండిన పొలాల పరిశీలన

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి

కరప, ఫిబ్రవరి 8: కలెక్టర్‌ ఆదేశాల మేరకు మం డల గ్రామాల్లో బుధవారం జిల్లాస్థాయి అధికారులు పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అరట్లకట్ట, కూరాడ, వాకాడ, వేములవాడ, కరప తదితర గ్రామాల్లో సాగునీటి ఎద్దడితో పొలాలు ఎండిపోతున్నాయి. దీనిపై ఆయా గ్రామాల రైతులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలోని సాగునీటి దుస్థితిని కన్నబాబు నేరుగా కలెక్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో జేడీఏ ఎన్‌.విజయ్‌కుమార్‌, జలవనరులశాఖ ఎస్‌ఈ జె.శ్రీనివాసరావు, ఆర్డీవో బీవీ.రమణబాబు ఆయా శాఖల అధికారులతో కలిసి సాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో పర్యటించారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా వంతులవారీ విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందని అధికారులు రైతులకు వివరించారు. ప్రస్తు తం ఉన్న మూడంచెల విధానం స్థానే ఐదంచెల విధానంలో సాగునీటిని సరఫరా చేయాలని జిల్లాస్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు వివరించారు. వంతులవారీ విధానంలో అవకతవకతలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సాగునీటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హా మీఇచ్చారు. జలవనరులశాఖ డీఈ ఆకెళ్ల రవికుమా ర్‌, తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, డీఏవో గాయత్రీదేవి, ఏవో అప్పసాని వెంకటరాజేష్‌, ఏఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు, నోవా పాల్గొన్నారు.

ఆర్డీవో భూముల పరిశీలన

తాళ్లరేవు, ఫిబ్రవరి 8: పి.మల్లవరం పంచాయతీ పరిధి శివారు భూములను కాకినాడ ఆర్డీవో బీరమణ బుధవారం పరిశీలించారు. సాగునీరు ఎద్దడి శివారు ప్రాంతాలైన పత్తిగొంది, గ్రాంటు గ్రామాల్లో కౌలురైతు లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న మూడెంచల విధానం కాకుండా ఐదెంచల విధానంలో నీటిని విదుడల చేసి ప్రవాహం పెంచితే సమస్య పరిష్కారం అవుతుందని ఏఈ ఈశ్వర్‌ చెప్పారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్టు ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ప్రశాంతి, తహశీల్దార్‌ ఎస్‌.పోతురాజు, ఎంపీడీవో అనుపమ, ఉపసర్పంచ్‌ పంపన రామకృష్ణ, వీఆర్వో ప్రకాశరావు, ఆర్‌ఐ రవితేజ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T00:13:59+05:30 IST