సాగునీటి ఎద్దడి లేకుండా క్రాస్‌బండ్ల నిర్మాణం: ఆర్డీవో
ABN , First Publish Date - 2023-02-24T00:00:45+05:30 IST
రబీకి సాగునీటి ఎద్దడి లేకుండా మురుగు కాలువలపై క్రాస్‌బండ్ల నిర్మాణం చేపడుతున్నట్టు కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ తెలిపారు. కరప శివారు పేపకాయలపాలెం వద్ద శహపురం డ్రెయిన్‌పై నిర్మిస్తున్న క్రాస్‌బండ్ పనులను గురువారం ఆయన పరిశీలించి తగిన సూచనలు జారీచేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడిక్కడ క్రాస్‌బండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించా

కరప, ఫిబ్రవరి 23: రబీకి సాగునీటి ఎద్దడి లేకుండా మురుగు కాలువలపై క్రాస్‌బండ్ల నిర్మాణం చేపడుతున్నట్టు కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ తెలిపారు. కరప శివారు పేపకాయలపాలెం వద్ద శహపురం డ్రెయిన్‌పై నిర్మిస్తున్న క్రాస్‌బండ్ పనులను గురువారం ఆయన పరిశీలించి తగిన సూచనలు జారీచేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడిక్కడ క్రాస్‌బండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రబీ సాగును పూర్తిచేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కృత్తికాశుక్లా, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు మండలంలోని పెదకొత్తూరు, యండమూరు, పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం, పేపకాయలపాలెం గ్రామాల్లో మురుగుకాలువలపై క్రాస్‌బండ్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. నీటిలభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీజిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.శ్రీనివాసరావు, ఏవో అ ప్పసాని వెంకటరాజేష్, డ్రైనేజీశాఖ ఏఈ కీర్తి, ఆర్‌ఐ పి.మాచరరావు, ఆర్డీవో సీసీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.