‘తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయండి’
ABN , First Publish Date - 2023-05-07T00:20:42+05:30 IST
కరప, మే 6: మా మొర ఆలకించి తడిచిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయండయ్యా...అంటూ పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రత్యేకాధికారి, రహదారులు, భవనాలశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, జేసీ ఎస్.ఇలాక్కియా, జేడీఏ ఎన్.విజయ్‌కుమార్ శనివారం మండలంలో కూరాడ, పేపకాయలపాలెం గ్రామాల్లో పర్యటించి కళ్లాల్లో ఆరబెట్టిన

కరప, మే 6: మా మొర ఆలకించి తడిచిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయండయ్యా...అంటూ పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రత్యేకాధికారి, రహదారులు, భవనాలశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, జేసీ ఎస్.ఇలాక్కియా, జేడీఏ ఎన్.విజయ్‌కుమార్ శనివారం మండలంలో కూరాడ, పేపకాయలపాలెం గ్రామాల్లో పర్యటించి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మొలకలొచ్చిన పంటను పరిశీలించారు. పలువురు రైతులు తేమశాతం, ముక్క విరిగిందని వంకలు పెడితే త మకు ఆర్‌బీకేల వల్ల జరిగే న్యాయమేమిటని ప్రశ్నించారు. పంట చేతికందే సమయంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఇటువంటి దుస్థితిలో నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఽరైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. ఏడీఏ కె.బాబూరావు, ఏవో అప్పసాని వెంకటరాజేష్, తహశీల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కర్రె స్వప్న, సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, ఆర్‌ఐ పి.మాచరరావు ఉన్నారు.
కాజులూరు: వర్షాల వల్ల పాడైన పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న తెలిపారు. మండలంలో జగన్నాధగిరి గ్రామంలో నీట మునిగిన పంట, మొలకెత్తిన ధాన్యపు రాశులను మం త్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయ్‌కుమార్, తహశీల్దార్ బీసాయిసత్యనారాయణ, ఏఓ అశోక్ ఉన్నారు.