విద్యుత్‌ చార్జీల పెంపునకు టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2023-05-23T23:46:53+05:30 IST

పిఠాపురం, మే 23: విద్యుత్‌ సరఫరాలో ఇష్టారాజ్యంగా విధిస్తున్న కోతలు, విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినియోదారులపై పలుమార్లు భారం మోపారని వర్మ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా మోసగించారని ఆరోపించారు. వ్యవసాయ కనెక్షన్లకు మోటా ర్లు బిగించి మరో భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచినా

విద్యుత్‌ చార్జీల పెంపునకు టీడీపీ ఆందోళన
పిఠాపురంలో అందోళన నిర్వహిస్తున్న వర్మ

పిఠాపురం, మే 23: విద్యుత్‌ సరఫరాలో ఇష్టారాజ్యంగా విధిస్తున్న కోతలు, విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినియోదారులపై పలుమార్లు భారం మోపారని వర్మ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా మోసగించారని ఆరోపించారు. వ్యవసాయ కనెక్షన్లకు మోటా ర్లు బిగించి మరో భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచినా కరెం టు సరఫరా ఉండటం లేదన్నారు. గ్రామాల్లో కరెం టు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి ఉందన్నా రు. విద్యుత్‌రంగాన్ని సీఎం జగన్‌ నిర్వీర్యం చేసి తన బినామీలకు దోచిపెడుతున్నారని వర్మ ఆరోపించారు. ఆందోళనలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, టీడీపీ పట్టణ, మండలశాఖ అధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్‌, ఉలవకాయల దేవేంద్రుడు, అనిశెట్టి సత్యానందరెడ్డి, గుండ్ర సుబ్బారావు, దేవరపల్లి రామారావు, బర్ల అప్పారావు, మడికి ప్రసాద్‌, ఎలుబండి రాజారావు, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్‌ పాల్గొన్నారు.

సామర్లకోటలో నిరసన

సామర్లకోట, మే 23: పెంచిన విద్యుత్‌ చార్జీలు తక్షణం తగ్గించాలని, విద్యుత్‌ కోతలు నిరోధించాలని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా 24 గంటలూ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో మఠం సెం టర్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట టీడీపీ ఆధ్వర్యం లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమార స్వా మి, బడుగు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో స్మార్ట్‌మీటర్లు ఏ ర్పాటు ఉపసంహరించుకోవాలని ప్లకార్డులను టీడీపీ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్‌, పొట్ట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరసనలో నాయకులు కంటే బాబు, బలుసు శ్రీనివాస్‌, పైణ్ణి శ్రీనివాస్‌, వట్టికూటి గోపి, ఎండీ సైఫుల్లా, ఎండీ హ బీబుల్లా, గొలితి సత్యనారాయణ, రామలక్ష్మి, పడాల వీరబాబు, తాతపూడి కృష్ణబాబు, చందలాడ వేణు, కేతా సాయిశంకర్‌, మెండెం సర్రయ్య, పోలిపల్లి బా బీ, తాతపూడి అరుణ్‌ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-23T23:46:53+05:30 IST