పద్యాలతో ప్రజలను మెప్పించిన కవి వేమన
ABN , First Publish Date - 2023-01-20T00:41:03+05:30 IST
సామాన్యు లకు సైతం అర్థమయ్యేభాషలో సాహిత్యాన్ని అందించి సమాజాన్ని చైతన్య పరచిన ప్రజాకవి వేమన అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జీవీ ఆర్.ప్రసాదరాజు అన్నా రు.
దివాన్‌చెరువు/బొమ్మూరు, జనవరి19 : సామాన్యు లకు సైతం అర్థమయ్యేభాషలో సాహిత్యాన్ని అందించి సమాజాన్ని చైతన్య పరచిన ప్రజాకవి వేమన అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జీవీ ఆర్.ప్రసాదరాజు అన్నా రు.ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, బొమ్మూరు కలెక్ట రేట్‌లో గురువారం వేమన జయంతిని నిర్వహించారు. వేమన చిత్రపటాలకు వీసీ ప్రసాదరాజు, జేసీ తేజ్‌భరత్ పూలమా లలు వేసి నివాళులర్పించారు.వీసీ మాట్లాడుతూ పామరు లకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలుచెప్పి ప్రజలను మెప్పించిన కవి వేమన అన్నారు. విశ్వదాభిరామ వినుర వేమ అనేమాట విననివారు ఉండరన్నారు. సమాజం, మానవ సంబంధాలపై యోగి వేమన పద్యాలు ఎంతగానో ప్రభావాన్ని చూపాయని జేసీ తేజ్‌భరత్ తెలిపారు. ఆయన రాసిన పద్యాలు 350 ఏళ్లవుతున్నా నేటికి ఆయన నీతిని మనం చెప్పుకుంటున్నామన్నారు.సమాజంలో రుగ్మతలను ధైర్యంగా చాటిన వ్యక్తి అన్నారు.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జయంతిని అధికారికంగా నిర్వహించినట్టు తెలిపారు. ఆర్డీవోలు నరసింహులు, చైత్రవర్షిణి మాట్లాడుతూ కడపలో చిన్న గ్రామంలో పుట్టిన వేమన సమాజంలో పరిస్థితులు ఆయనపై ప్రభావాన్ని చూపాయన్నారు.ఈ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ఓఎస్‌డీ ఆచార్య ఎస్.టేకి, సీఈ ఎస్.లింగారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.