Yanamala Krishnudu: చంద్రబాబు ఇచ్చిన హామీ ఎంతో తృప్తి నిచ్చింది..

ABN , First Publish Date - 2023-02-08T16:04:35+05:30 IST

యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సోదరుడు కృష్ణుడు (Krishnudu) బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆయన నివాసంలో కలిసారు.

Yanamala Krishnudu: చంద్రబాబు ఇచ్చిన హామీ ఎంతో తృప్తి నిచ్చింది..

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సోదరుడు కృష్ణుడు (Krishnudu) బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆయన నివాసంలో కలిసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఎంతో తృప్తి నిచ్చిందన్నారు. తనకు

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

తగు గుర్తింపు ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తనకు, తన సోదరుడు యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశంలోనే ఉన్నామని, టీడీపీ (TDP)లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అసంతృప్తి అనే మాటే లేదని, దివ్య (Divya) కూడా తన కూతురు లాంటిదని, ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని కృష్ణుడు అన్నారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ (Ex MLA Varma) మాట్లాడుతూ యనమల కృష్ణుడిని పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారని, అన్ని నియోజకవర్గాల్లో యాదవుల ఐక్యతకు కృష్ణుడు కృషి చేస్తారని వర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి..

చంద్రబాబు వద్దకు యనమల బ్రదర్స్ పంచాయతీ..

కాగా యనమల బ్రదర్స్ (Yanamala Brothers) పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari Dist.), తుని (Tuni) ఇన్చార్జ్‌గా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnadu) కుమార్తె దివ్య (Divya) నియామకంపై యనమల సోదరుడు కృష్ణుడు (Krishnudu) అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ (YCP) గాలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు (TDP Leaders) అప్రమత్తమయ్యారు. నిన్న ఉదయం నుంచి యనమల రామకృష్ణుడు నివాసంలో దీనిపై చర్చలు జరిగాయి. ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో కృష్ణుడిని తనవద్దకు తీసుకురావాలని యనమలకు సూచించారు. దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, వరుపుల రాజా.. యనమల కృష్ణుడిని తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చారు.

Updated Date - 2023-02-08T16:04:39+05:30 IST