Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయక.. ముద్దుపెట్టుకుంటారా?.. కొడాలి సెటైర్
ABN , First Publish Date - 2023-09-07T14:18:40+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. అవినీతి పనులు చేసే చంద్రబాబును.... అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) సెటైర్లు విసిరారు. అవినీతి పనులు చేసే చంద్రబాబును.... అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయమా అని నిలదీశారు. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు. దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే..... చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు చెప్పాలని.... చంద్రబాబులా సెల్ఫీలు తీసుకొని చెప్పుకోవడమెంటో అంటూ చమత్కరించారు. హైదరాబాద్ కట్టాననే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ రాదని..... పిట్టలదొర లే లోటుని ఆయన తీరుస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.