Former minister Narayana: ఏపీలో అభివృద్ధి లేదంటూ జగన్ సర్కారుపై విమర్శలు
ABN , First Publish Date - 2023-10-24T16:50:23+05:30 IST
ఏపీలో అభివృద్ధి లేదంటూ జగన్ సర్కారుపై (Jagan government) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ (Former minister Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు: ఏపీలో అభివృద్ధి లేదంటూ జగన్ సర్కారుపై (Jagan government) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ (Former minister Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఏపీలో అభివృద్ది లేదు. అభివృద్ధి లేకుంటే అరాచకమే. బీహార్ రాష్ట్రం అందుకు నిదర్శనం. చంద్రబాబు హైదరాబాద్ మాదాపూర్‌లో ఒక్క బిల్డింగ్ కడితే, అనేకమైన సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి. ఏంతో మందికి ఉద్యోగాలొచ్చాయి. విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు." అని నారాయణ అన్నారు.