AP News: హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపు: బొప్పరాజు
ABN , First Publish Date - 2023-05-15T20:31:17+05:30 IST
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు.
పుట్టపర్తి: ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు. ఏసీబీ దాడుల రూపంలో ఉద్యోగులను వేధించడం సరికాదని అన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా నాయకులతో కలిసి కలెక్టర్ అరుణ్‌బాబు, ఎమ్మెల్యేలను కలిసి, వినతిపత్రాలు అందజేశారు. అనంతరం పుట్టపర్తి (Puttaparthi)లో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోగా దాచుకున్న పీఎఫ్ సొమ్ము కూడా వాడుకోవడం సరికాదని అన్నారు. ఆ సొమ్ము తిరిగి చెల్లించకుండా ఇబ్బందిపెట్టడం దారుణమని అన్నారు. ఈనెల 22న అనంతపురంలో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.