TDP: మంత్రి నాగార్జునపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-08-24T17:42:10+05:30 IST

వైసీపీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున(Minister Nagarjuna)పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.

TDP: మంత్రి నాగార్జునపై  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

అమరావతి: వైసీపీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున(Minister Nagarjuna)పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి మేరుగ నాగార్జున 23.08.2023న ఎంపీడీఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ 4 వేల ఫామ్-7 అప్లికేషన్లు పెట్టి ప్రత్యర్ధుల ఓట్లు తొలగించాలని చెప్పారు.ఇంటింటి ఓట్ల సర్వే సమయంలో ఇళ్లలో లేని వారి ఓట్లు తొలగించాలని సైతం చెప్పారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రత్యర్ధుల ఓట్లు తొలగించాలని చూడటం దుర్మార్గం. ఇది ఎన్నికల సంఘం ఆదేశాలకు, నియమ నింబంధనలకు పూర్తి విరుద్ధం. ఓటర్ అర్హతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చాలా స్ఫష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ సమావేశానికి వాడుకొని ఓట్లు తొలగించాలని కార్యకర్తలను రెచ్చగొట్టడం చట్టవిరుద్ధం. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలి’’ నక్కా ఆనంద్‌బాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Updated Date - 2023-08-24T20:13:14+05:30 IST