Pawan Kalyan: గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం

ABN , First Publish Date - 2023-07-08T20:17:56+05:30 IST

వైసీపీ(ycp)విముక్త ఆంధ్రప్రదేశ్(ap) చూడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలని జనసేన(janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.

 Pawan Kalyan: గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం

అమరావతి: వైసీపీ(ycp)విముక్త ఆంధ్రప్రదేశ్(ap) చూడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలని జనసేన(janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో వారాహి విజయయాత్ర( Varahi Vijayatra ) కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. యాత్ర తొలి విడతను విజయవంతం చేయడంలో భాగమైన కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుంది.ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిద్దాం. 'వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి,పడిన కష్టం కళ్లారా చూశా. ఈ పోరాటం వృథా కాదు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మలి విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో మనందరం కలిసి విజయవంతం చేద్దాం. వారాహి విజయయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ముద్ర బలంగా ఉంటుందని అర్ధమైంది.


ఇక్కడ ప్రారంభమైతే అది రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు వెళ్తే రాష్ట్రానికి అంత మేలు. మీ కష్టం మరిచిపోలేనిది. భవిష్యత్తులో మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఉంటుంది” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

వారాహి యాత్ర స్ఫూర్తిదాయకం: నాదెండ్ల మనోహర్

వారాహి యాత్ర ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం. అంతా కలసికట్టుగా పార్టీ కోసం ఒక చక్కటి కార్యక్రమం చేసుకోగలిగామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘‘ప్రతి కమిటీ ఎంతో ఒత్తిడిలోనూ వలంటరీగా కష్టపడి యాత్ర విజయానికి సహకరించారు. ప్రతి ఒక్కరూ ఒక యంత్రంలా రాత్రింబవళ్లు కృషి చేశారు. అంతా అద్భుతంగా సహాయ సహకారాలు అందించారు. మరింత బాధ్యతతో ముందుకు వెళ్దాం. పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన ప్రతి చోటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-07-08T20:20:10+05:30 IST