Big Shock to Jagan : జగన్‌కు షాక్.. కడప నుంచి 100 వాహనాల్లో అమరావతికి వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు సమక్షంలో..

ABN , First Publish Date - 2023-07-07T13:13:58+05:30 IST

సీఎం జగన్‌కు సొంత ఇలాఖాలో తన పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ ఇచ్చారు. సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరుతున్నారు.

Big Shock to Jagan : జగన్‌కు షాక్.. కడప నుంచి 100 వాహనాల్లో అమరావతికి వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు సమక్షంలో..

కడప : సీఎం జగన్‌కు సొంత ఇలాఖాలో తన పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ ఇచ్చారు. సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకులు భారీగా టీడీపీలో చేరుతున్నారు. ప్రొద్దుటూరు22 వవార్డు కౌన్సిలర్ మహ్మద్ గౌస్ , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జబీవుల్లాతోపాటు1000 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేటి ఉదయం ప్రొద్దుటూరు నుంచి100 వాహనాల్లో భారీ కాన్వాయ్‌తో అమరావతికి వైసీపీ శ్రేణులు వెళ్లాయి. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏడాదికి పైగా స్ధానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి కౌన్సిలర్ గౌస్, ఇతర వైసీపీ నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Updated Date - 2023-07-07T13:22:14+05:30 IST