జన.. జమ్మలమడుగు

ABN , First Publish Date - 2023-05-30T23:56:55+05:30 IST

నారా లోకేశ్‌ యువగళం 111వ రోజు పాదయాత్ర జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 5గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. పెద్ద పసుపులమోటు మీదుగా వచ్చి తాడిపత్రి రోడ్డులో సంజామల మోటు వద్ద బహిరంగసభ నిర్వహించారు.

జన.. జమ్మలమడుగు
జమ్మలమడుగులో జనసంద్రమైన రోడ్డు

లోకేశ్‌ బహిరంగసభకు పోటెత్తిన జనం

సుధీర్‌రెడ్డిపై విరుచుకుపడ్డ లోకేశ్‌

చికెన్‌, మటన్‌లో కూడా కమీషన్లే అంటూ ఫైర్‌

జనం నుంచి విశేష స్పందన

12.1 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర

కడప, మే 30 (ఆంధ్రజ్యోతి): నారా లోకేశ్‌ యువగళం 111వ రోజు పాదయాత్ర జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 5గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. పెద్ద పసుపులమోటు మీదుగా వచ్చి తాడిపత్రి రోడ్డులో సంజామల మోటు వద్ద బహిరంగసభ నిర్వహించారు.

డాక్టర్‌ కాదు.. యాక్టర్‌ సుధీర్‌రెడ్డి

‘‘2019 ఎన్నికల్లో తాను గెలిస్తే జమ్మలమడుగు జాతకం మారుస్తానని సుధీర్‌రెడ్డి చెప్పారు. జమ్మలమడుగు జాతకం మారలేదు. సుధీర్‌రెడ్డి జాతకం మారింది. సుధీర్‌రెడ్డి ఉదయం రెండు సూట్‌కేసులతో బయటికి వెళతాడు. ఒకటి ఖాళీ, రెండోది బీర్‌ కేసు. సాయంత్రం వచ్చేసరికి బీరు కేసు ఖాలీ అవుతుంది, సూట్‌కేసు ఫుల్‌ అవుతుంది. ఎన్నికల ముందు.. వేసుకున్న చొక్కా, బనియను నాది కాదు. నేను చిన్న డాక్టరును అని చెప్పిన సుధీర్‌రెడ్డి మాట మార్చారు. ఇప్పుడు మాది జమిందారు కుటుంబం అంటున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తి సడెన్‌గా ఎలా వచ్చింది? బాబాయి మర్డరు కేసులో డబ్బులు ఇవ్వడం నుంచి ఇసుక దోపిడీ, గ్రావెల్‌ దోపిడీ, పరిశ్రమల నుంచి నెలనెలా కమీషన్లు, వెంచర్లు వేసే వారి వద్ద కమీషన్లు తీసుకుంటున్నారు. ఉద్యోగస్తుల ట్రాన్సఫర్లలో కమీషన్లు, ఆఖరికి చికెన్‌, మటన్‌ షాపులు మినరల్‌ వాటర్‌ వారి వద్ద కూడా కమీషన్లు తీసుకుంటున్నారు’’ అని లోకేశ్‌ అనడంతో జనం నుంచి విపరీత స్పందన వచ్చింది. ‘‘సుధీర్‌రెడ్డి గురించి తెలుసుకున్న తరువాత ఆయన పేరు మార్చాను. ఆయన డాక్టర్‌ సుఽధీర్‌రెడ్డి కాదు యాక్టర్‌ సుధీర్‌రెడ్డి. ఎన్నికల్లో ఖర్చయిన డబ్బు మొదటి నెలలోనే వసూలు చేసుకున్నాడు. మున్సిపల్‌ వర్క్స్‌ అని తన బినామీలకు ఇచ్చుకుని దోచేస్తున్నాడు. ప్రతి నెలా క్వారీలు, గ్రానైట్‌ పరిశ్రమల నుంచి కప్పం కట్టించుకుంటున్నాడు. మైలవరం మండలంలో సోలార్‌పార్కు యజమానిని బెదిరించాడు. అంగన్వాడీ పోస్టులు కూడా అమ్ముకున్నారు. ఈ దోపిడీకి భయపడి ఎన్నో కంపెనీలు పారిపోయాయి. సోలార్‌ ఎనర్జీకి సంబంధించి కంపెనీలు, గండికోట సాఫ్ట్‌ బ్యాంకు కంపెనీ, గండికోట అడిషనల్‌ లిఫ్టు ప్రాజెక్టు కంపెనీ పారిపోయాయి. టూరిజం రోప్‌వే ప్రాజెక్టు వెళ్లిపోయింది. పెన్నానది నుంచి ఇసుక గ్రావెల్‌ అక్రమంగా తవ్వేసుకుంటున్నారు’’ అన్నారు.

అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గండికోట బాధితులకు పరిహారం ఇస్తామని, ఆర్టీపీపీలో కార్మికులను రెగ్యులర్‌ చేయడంతో పాటు జీతాలు పెంచుతామని అన్నారు. ‘‘జమ్మమడుగులో పుట్టా, మా నాన్న ఇక్కడే డాక్టరుగా పనిచేశాడు. జమ్మలమడుగును అభివృద్ధి చేస్తామని చెప్పి గుండుసున్నా చేశాడు’’ అని జగన్‌పై మండిపడ్డారు. మైలవరంలో మూతబడిన టెక్స్‌టైల్స్‌ తెరిపిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే శెనగ రైతులను ఆదుకుంటామని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడునెలలకే టిడ్కో ఇళ ్లను పేదలకందిస్తామన్నారు. జిల్లాలో టీడీపీ కార్యకర్తలను వేధించారు. కొందరిని చంపారు. ఇబ్బంది పెట్టిన వారు కడపలో ఉన్నా కాంబోడియా పారిపోయినా వదలిపెట్టమని, పట్టుకొచ్చి లోపల వేస్తామన్నారు.

జమ్మలమడుగులో జోష్‌

పెన్నానది నీళ్లలో పౌరుషం జమ్మలమడుగు ప్రజల్లో ఉంటుంది. ఘన చరిత్ర ఉన్న గండికోటను ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. అలాగే జమ్మలమడుగును టచ్‌ చేసే దమ్ము ఎవరికీ లేదు. జమ్మలమడుగు పాదయాత్రలో జనం కష్టాలు చూశాను, వారి కన్నీళ్లు తుడుస్తాను. జమ్మలమడుగులో జోష్‌ అదిరింది. లోకేశ్‌, భూపేష్‌ జోడి అదిరిపోయింది.. అనడంతో జనం నుంచి మంచి స్పందన వచ్చింది.

పాదయాత్రలో మాజీమంత్రి అమరనాఽథరెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, పొలిట్‌ బ్యూరోసభ్యుడు ఆర్‌.శ్రీని వాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, శివనాఽథరెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వికాస్‌ హరి, మీడియా కో ఆర్డినేటరు జనార్ధన్‌, రితీశ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర

యువగళం 112వ రోజు పాదయాత్ర బుధవారం ప్రారంభం కానుంది. లోకేశ్‌ ఇప్పటి వరకు 1435.8 కిమీ నడిచారు. నేటి పాదయాత్ర జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో జరగనుంది.

మధ్యాహ్నం 2గంటలకు దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాంపు సైట్‌లో పద్మశాలి సామాజిక వర్గీయులతో ముఖాముఖి

-4గంటలకు దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం

-4.05కు సలివెందులలో స్థానికులతో సమావేశం

-4.10కి దేవగుడి క్రాస్‌ వద్ద మాటామంతి

-5గంటలకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రవేశం. చౌడూరులో మాటామంతి

-5.10కి చౌడూరులో రైతులతో సమావేశం

-6గంటలకు శంకరాపురంలో పద్మశాలీ

సామాజిక వర్గీయులతో భేటీ

-6.30కి పెద్దశెట్టిపల్లెలో గౌతం ఇంజనీరింగ్‌

కాలేజీ వద్ద స్థానికులతో సమావేశం

-6.35కు పెద్దశెట్టిపల్లె బస్‌షెల్టరు వద్ద రైతులతో సమావేశం

-6.50కి నరసింహాపురంలో ఎమ్మార్పీఎస్‌ నేతలతో సమావేశం

-7.20కి చౌటపల్లె బాస్‌ క్రికెట్‌ ప్రాంగణం వద్ద విడిది కేంద్రంలో బస.

మంగళవారం 12.1 కిమీ

యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్‌ 111వ రోజైన మంగళవారం 12.1 కి.మీ నడిచారు. జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 5గంటలకు యాత్రం మొదలైంది. రాత్రి 10గంటలకు జమ్మలమడుగు మండలం సలివెందల గ్రామంలోని విడిది కేంద్రం చేరుకున్నారు. ఇప్పటి వరకు 1435.8 కిమీ నడిచారు.

Updated Date - 2023-05-30T23:56:55+05:30 IST