జాతీయ లోక్ అదాలతను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2023-02-04T23:09:20+05:30 IST
రాజంపేట మండలం కూచివారిపల్లెలో శనివారం రాజంపేట జూనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

రాజంపేట, ఫిబ్రవరి2 : రాజంపేట మండలం కూచివారిపల్లెలో శనివారం రాజంపేట జూనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే.. రాజమార్గమని, ఈ నెల 11న జరిగే జాతీయ లోక్ అదాలతను వినియోగించుకొని సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలన్నారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి స్థోమత లేని వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా తమకు తెలియ కుండా తమ అకౌంట్‌లో డబ్బులు తీసుకున్నప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వి.నాగేశ్వరచౌదరి, కూచివారిపల్లె సర్పంచ, గ్రామ సచివాలయ సెక్రటరీ, ప్రజలు, కోర్టు సిబ్బంది మధుసూదనరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
రాజీ పడదగిన కేసులు పరిష్కరించాలి
నందలూరు: నందలూరు కోర్టులో ఈ నెల 11న జరిగే జాతీయ మెగా లోక్ అదాలతలో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన, నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కె.లత పోలీసులకు సూచించారు. శనివారం కోర్టు చాంబర్‌లో పోలీసులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లోక్ అదా లతకు సంబంధించి ప్రతి రోజు ప్రి అదాలత సిట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మన్నూరు సీఐ పుల్లయ్య, రాజంపేట ఎస్ ఈబీ సీఐ శ్రీహరి రెడ్డి, పుల్లంపేట, పెనగలూరు ఎస్‌ఐలు సుబ్బారెడ్డి, హేమాద్రి, నందలూరు, పుల్లంపేట, పెనగలూరు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.