ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ABN , First Publish Date - 2023-08-09T23:46:33+05:30 IST

ఆంధ్రప్రదేశ గిరిజన యానాది సేవా సంఘం, రాష్ట్ర గిరిజన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పీలేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
పీలేరులో ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సంఘాల నాయకులు

పీలేరు, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ గిరిజన యానాది సేవా సంఘం, రాష్ట్ర గిరిజన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పీలేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరిజనులు, గిరిజన విద్యార్థులతో స్థానిక వివేకానంద కూడలి నుంచి డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ గిరిజనులు స్వాతంత్య్ర ఫలాలు అందుకోలే కపోతున్నారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గిరిజనులు ఇప్పటికీ గుడిసె ల్లో ఉంటున్నారని వాపోయారు. గిరిజనులు ఐకమత్యంగా ఉంటూ వారి హక్కులు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షు డు పులి శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు జానం గంగిరెడ్డి, గిరిజన సమాఖ్య పీలేరు అధ్యక్షుడు కిల్లా విజయ్‌ కుమార్‌, పీలేరు ఏఎంసీ డైరెక్టర్‌ కాలనీ చిన్నా, నాయకులు ఆవుల కాటయ్య, గడ్డం శ్రీనివాసులు, రెడ్డప్ప, ఈశ్వర య్య, తిరుమలశెట్టి రమణ, వెంకటగిరి రాజేశ, బాబు రమేశ, నాగరాజ, దేవకుమార్‌, నారాయణమ్మ, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-09T23:46:33+05:30 IST