Share News

వైసీపీ నేతలు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:15 PM

దువ్వూరు మండలంలోని మాచనపల్లె మాజీ సర్పంచ్‌తో సహా పలువురు వైసీపీ నాయకులు సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

వైసీపీ నేతలు టీడీపీలో చేరిక
వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న పుట్టా

దువ్వూరు (మైదుకూరు), డిసెంబరు 18 : దువ్వూరు మండలంలోని మాచనపల్లె మాజీ సర్పంచ్‌తో సహా పలువురు వైసీపీ నాయకులు సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్‌ మల సాని వెంకట రమణ, సుదర్శన్‌, పుల్లయ్య, తిరుపాలయ్య, వెంకట రమణ తదితరులకు చెందిన దాదాపు 60 కుటుంబాల వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఇప్పటికే చాలా మంది టీడీపీలోకి చేరారని, ఇక పెద్ద ఎత్తులు వలస వస్తారని, వారందరికీ అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బోరెడ్డి వెంకట రమణారెడ్డి, పాకం రామ సుబ్బారెడ్డి, నాగేశ్వర రెడ్డి, రాంబాబు, సంజీవరెడ్డి, ఉస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Dec 18 , 2023 | 11:15 PM