YCP: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
ABN , First Publish Date - 2023-08-09T15:28:12+05:30 IST
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. ఈ చర్చలో పాల్గొన్న వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు (Opposition Parties) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని (No Confidence Motion) వైసీపీ (YCP) వ్యతిరేకించింది. ఈ చర్చలో పాల్గొన్న వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy) మాట్లాడుతూ.. మణిపూర్ (Manipur)లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని, ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మణిపూర్ మహిళలను కాపాడాలని అన్నారు. మణిపూర్‌లో రెండు వర్గాల వారిని కూర్చోబెట్టి.. చర్చలు జరిపి పరిష్కరం చేయాలన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించాలని.. శాంతిని పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యనికి అర్ధం ఉండదని వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో అదనపు బలగాలు మోహరించాలని.. రెండు వర్గాలతో చర్చలు జరపాలని.. మణిపూర్ మయన్మార్‌తో బలహీనమైన సరిహద్దు కలిగి ఉందని.. బలహీనమైన సరిహద్దు దేశ భద్రతకి మంచిది కాదని మిథున్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అవిశ్వాసానికి విలువ లేదని వైసీపీ భావిస్తోందన్నారు. అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉందని, అవిశ్వాస తీర్మానం రెండు కూటముల మధ్య రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమేనన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.