YCP: వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కారులో మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2023-01-26T19:05:01+05:30 IST
ఖాజీపేట దగ్గర భారీగా కర్ణాటక మద్యాన్ని (Karnataka liquor) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప: ఖాజీపేట దగ్గర భారీగా కర్ణాటక మద్యాన్ని (Karnataka liquor) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కారులో మద్యాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బి.మఠం మండలం వైసీపీ (YCP) సోషల్ మీడియా కన్వీనర్ శివరామకృష్ణ కారులో 50 కేస్ల మద్యం సీసాలను గుర్తించామని పోలీసులు చెప్పారు. మద్యం తరలింపు వ్యవహారంపై శివరామకృష్ణను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు.