Bopparaju: నేటి నుంచి ఉద్యోగులు వర్క్ టూ రూల్...
ABN , First Publish Date - 2023-03-21T14:59:05+05:30 IST
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు (Employees) మంగళవారం నుంచి వర్క్ టూ రూల్ (Work to Rule) పాటించాలని పిలుపు ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkteswarlu) తెలిపారు.
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు (Employees) మంగళవారం నుంచి వర్క్ టూ రూల్ (Work to Rule) పాటించాలని పిలుపు ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkteswarlu) తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకూ మాత్రమే విధులు నిర్వహించాలని సూచించామన్నారు. ప్రభుత్వం 11 పీఆర్సీ అరియర్‌లు (11 PRC Arrears) ఇవ్వక పోగా ఇవ్వాల్సిన బకాయిలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
పీఆర్సీ అరియర్లు ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోవడం ఏమిటని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కేడర్ వారీగా స్కేల్స్ కూడా నిన్న రాత్రి హడావిడిగా ఇచ్చారని, పే స్కేల్ విషయంలో ప్రభుత్వమే సొంత ఉద్యోగులకు, మోసం అన్యాయం చేస్తుందా?.. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాలు, నాయకత్వానికి అతీతంగా ఉద్యోగులు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపిచ్చారు. 2015లో ఇస్తున్న అలవెన్సులు అమలు అవుతున్నాయన్నారు.
జీత భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వకుండా ప్రభుత్వం పే స్కేలు మోసాలు కూడా చేస్తోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు లేవని చెప్పడం దుర్మార్గమన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు వర్క్ టూ రూల్ ఉంటుందని, మిగతా సంఘాలు కూడా కలిసి రావాలని కోరుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.