Ayyanna Patrudu: జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే వివేకా హత్య..

ABN , First Publish Date - 2023-02-16T12:28:41+05:30 IST

విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Ayyanna Patrudu: జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే వివేకా హత్య..

విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే వైఎస్ వివేకా హత్య (Viveka Murder) జరిగిందని ఆరోపించారు. ‌బాబాయిని చంపడానికి ఎంపీ టిక్కెట్‌ (MP Ticket) కారణమని పేర్కొన్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి (Vijayasai reddy)ని కూడా సీబీఐ (CBI) విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తప్పులు బయటపడుతుంటే సీఎం జగన్‌ డైవర్షన్ పాలిటిక్స్ (Diversion Politics) చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు (Kodikatti Case) నాలుగేళ్లు అయినా ఎందుకు‌ విచారణ సాగుతోందని ప్రశ్నించారు. ఏపీ రాజధాని‌ (AP Capital) విషయంలో ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలు (Tughlaq Decisions) తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఏపీకి సీఎం జగన్‌రెడ్డా..? సజ్జల రామకృష్ణారెడ్డా? (Sajjala Ramakrishna Reddy) అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.

వివేకానంద రెడ్డి హత్యను జగన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు (Chandrababu)కు ఆపాదించారని, అవినీతి పత్రికలో‌ విషం కక్కారని అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక హత్య కేసు మాఫీ‌ చేయాలని చూశారని.. ఇప్పుడు సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకి వస్తున్నాయన్నారు. రక్తపు మడుగులో ఉంటే విజయసాయి రెడ్డి గుండె పోటు అని ఎలా చెప్పారని ప్రశ్నించారు.

వివేకానంద రెడ్డి కుమార్తె సునీత (Sunitha) ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆమెను‌ చూస్తే ప్రజలు కూడా న్యాయం జరగాలని‌ కోరుతున్నారని అయ్యన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసును ఎలా తారుమారు‌ చేద్దామా అని‌ చూస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో గందరగోళంగా ప్రకటనలు చేస్తున్నారని, విశాఖ రాజధానిగా ఏ చట్టం ప్రకారం పెడతారని ప్రశ్నించారు. మాయలు, మోసాలు‌ చేయడానికీ సిగ్గు అనిపించడం లేదా? ఇప్పటికైనా అబద్దాలు ప్రచారంతో మాయలు‌ చేయడం మానుకోవాలని సూచించారు.

జగన్ ఎపీని సర్వ నాశనం చేసి... దేశం మొత్తం రాష్ట్రం పరువు తీశారని అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయసాయి రెడ్డి రూ. 40 వేల కోట్లు దోచుకుని నీతులు‌ చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రజలు ఆలోచించాలని, జగన్‌కు బుద్ది చెప్పకపోతే మీ పిల్లలకు భవిష్యత్తు ఉండదని అన్నారు. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడిద్దామనుకుంటే అన్ని వేళలా కుదరదన్నారు.

కడప స్టీల్ ఫ్లాంట్‌కు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారని అయ్యన్న ప్రశ్నించారు. కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని సీఎం... చంద్రబాబును ముసలోడు అంటారా? అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి రోజా లాంటి‌వాళ్ల మీద మాట్లాడి తమ విలువ తగ్గించుకోమని అన్నారు. వాళ్లంతా సంస్కారం‌ లేని మనుషులని.. అలాంటి వాళ్లపై తాము స్పందించమని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-16T12:44:29+05:30 IST