Share News

Bandi Srinivasa Rao: ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తున్నాం

ABN , First Publish Date - 2023-10-30T12:55:17+05:30 IST

విజయవాడ: కావలిలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన నిందితులలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారని, ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.

Bandi Srinivasa Rao: ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడిని ఖండిస్తున్నాం

విజయవాడ: కావలి (Kavali)లో ఆర్టీసీ బస్ డ్రైవర్‌ (RTC Bus Driver)పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన నిందితులలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారని, ప్రధాన నిందితుడిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (Bandi Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగస్తులు ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేస్తారని, ఇది కూడా ఒక సేవ లాంటిదేనని అన్నారు.

కొంత మంది వైసీపీ శ్రేణులు తిరుపతి జిల్లా, పీలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్‌పైన దాడి చేశారని, వాళ్ళపై కూడా ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బండి శ్రీనివాసరావు కోరారు. తమకు ఇంకా రావాల్సిన మరికొన్ని డిఏలను కూడా వేంటనే రిలిజ్ చేయాలని, 1200 కోట్లు రూపాయలు, డిఏలు, ఇతర అలవెన్సులు కూడా రావాలని... అవి కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులకు కూడా డిఏలు రావాల్సి ఉందని, రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని, వారి జీతాలు పెంచాలన్నారు. నవంబర్ 3న ఢీల్లీలో రామ్‌లీలా మైదానంలో లక్షల మందితో సీపీఎస్ వద్దని.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ధర్నా చేస్తామని బండి శ్రీనివాసరావు తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-10-30T12:55:17+05:30 IST