AP News: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు
ABN , First Publish Date - 2023-04-08T13:07:13+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ (Lenin Center) వద్ద నల్లకండువాలు ఫ్ల కార్డులతో ఆందోళనకు దిగింది.
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ (AP JAC) అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది. నల్ల కండువాలతో విజయవాడ లెనిన్ సెంటర్ (Lenin Center) వద్ద ఫ్ల కార్డులతో ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) మాట్లాడుతూ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు (Salaries), పెన్షన్లు (Pensions) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 11వ పీఆర్సీ (11th PRC) ప్రతిపాదిత స్కేళ్లు అమలు చేయాలని, పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏపీలో ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో సర్కార్ ఉందని బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగులకే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? వాలంటీర్లు, సలహాదారులుగా ఉన్న వారికి రూ. 20 వేల కోట్లు ఇస్తున్న మాటను ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. సర్వీసు రూల్స్ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాలలో ఉద్యోగుల పరిస్థితి బాగుందని, మలిదశ పోస్టర్లు విడుదలతో ఉద్యమం మొదలై తీవ్రతరం అవుతుందన్నారు. ప్రభుత్వ యాప్ వినియోగాన్ని నిలిపి వేస్తూ సెల్ ఫోన్ డౌన్ చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారుస